సంచలన నిజం: షమ్మి కపూర్‌తో వివాహంపై ఆశా పరేఖ్ తొలిసారి స్పందన!
షమ్మి కపూర్ -ఆశా పరేఖ్ జోడీ తెరపై ఎంత అద్భుతంగా ఉండేదో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Srikanth Kontham | 20 Aug 2026 5:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగంగా పిలువబడే కాలంలో ఎంతోమంది దిగ్గజ నటీనటులు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ తరం అగ్ర నాయికలలో ఒకరైన అందాల తార ఆశా పరేఖ్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాలను అందించారు. అయితే సినిమాల విషయాలతో పాటు.. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని పుకార్లు దశాబ్దాలుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ నటుడు షమ్మి కపూర్‌తో ప్రేమ ..వివాహం గురించి నాటి కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కాలక్రమేణా ఈ రూమర్లపై ఎట్టకేలకు ఆశా పరేఖ్ స్వయంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ఆటోబ యోగ్రఫీ `ది హిట్ గర్ల్` విడుదల సమయంలో తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను బహిరంగంగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే షమ్మి కపూర్‌తో తనకున్న అనుబంధం గురించి వస్తోన్న వార్తలపై స్పందించారు. తాము వివాహం చేసుకున్నట్లు వచ్చిన ప్రచారంలో కొంత నిజం ఉందని పరోక్షంగా అంగీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
షమ్మి కపూర్ -ఆశా పరేఖ్ జోడీ తెరపై ఎంత అద్భుతంగా ఉండేదో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించడంతో పాటు.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆన్-స్క్రీన్ జోడీగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ సాన్నిహిత్యమే వారి మధ్య ప్రేమకు దారితీసిందని.. అయితే కొన్ని వ్యక్తిగత పరిస్థితుల కారణంగా పెళ్లి వరకు వెళ్లలేకపోయారని నాటి సినీ విశ్లేషకులు భావిస్తుండేవారు.
అయితే ఆశా పరేఖ్ ఇంటర్వ్యూలలో ... పుస్తకంలో మాత్రం తాము ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడినప్పటికీ కొన్ని సామాజిక .. కుటుంబపరమైన బాధ్యతల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. షమ్మి కపూర్ అప్పటికే గీతా బలిని వివాహం చేసుకుని ఉండటం, ఆశా పరేఖ్ కెరీర్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉండటం వంటి కారణాలు వారి బంధంపై ప్రభావం చూపాయి. ఎవరి జీవితంలో వారు ముందుకు వెళ్లినా? ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం .. ఆప్యాయత జీవితాంతం అలాగే కొనసాగాయని పేర్కొన్నారు.
పరిశ్రమలో గ్లామర్ వెనుక ఉండే ఇలాంటి భావోద్వేగమైన కథలు ఎప్పుడూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఆశా పరేఖ్ జీవితంలోని అత్యంత వ్యక్తిగత విషయాలను దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాటి తరం నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎంతటి సున్నితమైన పరిస్థితుల మధ్య గడిచాయో? ఈ సంఘటన మరోసారి నిరూపిస్తుంది.
ఆశా పరేఖ్ - షమ్మి కపూర్ వివాహం గురించి నడిచిన ఊహాగానాలకు ఆమె ఇచ్చిన వివరణతో స్పష్టత వచ్చింది. వెండితెరపై ప్రేమ కథలను రక్తికట్టించిన దిగ్గజ నటుల నిజ జీవిత ప్రయాణం ఎంతో మందికి ఎమోషనల్ అను భూతిని మిగిల్చింది. నాటి స్వర్ణయుగపు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
