ఫ్రిజ్‌లో ఇన్నర్స్... నటుడి దారుణమైన పరిస్థితి!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
By: Ramesh Palla | 10 Oct 2025 11:58 AM ISTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిరీస్‌లోని పలు అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. సిరీస్‌లోని ప్రతి పాత్రను బాలీవుడ్‌లో ఉన్న ఎవరో ఒక నటీనటులకు సంబంధించినదిగా మాట్లాడుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ అనుకున్నట్లుగానే బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సిరీస్ గురించి ఈ స్థాయిలో ప్రచారం జరిగిన దాఖలాలు లేవు. ఆర్యన్ ఖాన్ ఖాన్‌ను ఈ వెబ్ సిరీస్‌ను చాలా అనుభవం ఉన్న ఒక దర్శకుడిగా రూపొందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ పరిచయం చేసిన పలువురు నటీనటులు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో..
బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటించిన రాఘవ్ జుయల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఆయన అడుగు పెట్టి చాలా కాలం అయింది. అయితే ఇప్పటి వరకు దక్కని గుర్తింపు ఈ వెబ్ సిరీస్‌తో ఆయన దక్కించుకున్నాడు. సైడ్ డాన్సర్‌గా కెరీర్ ఆరంభించి, పలు రియాల్టీ షో ల్లో పాల్గొనడంతో పాటు, పలు డాన్స్ షో ల్లో విజేతగా నిలవడం ద్వారా ఇండస్ట్రీలోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. గత ఏడాదిలో వచ్చిన కిల్ సినిమాతో నటుడిగా అలరించాడు. అయితే ఆ సమయంలో రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన స్టార్‌డం దక్కలేదు. అది ఎట్టకేలకు ఇప్పుడు రాఘవ్ జుయల్‌కి దక్కింది. రాఘవ్ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, సవాళ్లను గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాఘవ్ జుయల్ నటుడిగా..
రాఘవ్ జుయల్ మాట్లాడుతూ... తాను డాన్సర్‌గా చేస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి రూం షేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో ఒక్క రూంలో మొత్తం పది మంది ఉండేవాళ్లం. మా రూంలో ఉన్న ఫ్రిజ్ పని చేసేది కాదు. దాంతో మేము దాన్ని ఒక అల్మారా మాదిరిగా వినియోగించుకునే వాళ్లం. మేము అందరం దానిలో మా ఇన్నర్స్ తో పాటు కొన్ని రకాల డ్రెస్‌లను అందులో ఉంచేవాళ్లం. ఎవరైనా కొత్తగా మా రూంకి వచ్చిన సమయంలో అది ఫ్రిజ్‌గా భావించి ఓపెన్ చేస్తే ఇన్నర్స్ కనిపించేవి. వాటిని చూసి వారు షాక్ అయ్యే వారు. అప్పటి మా పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది అనేందుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా రాఘవ్ జుయల్ అన్నాడు. నటుడిగా ఆఫర్లు పొందడం కోసం చాలా శ్రమ పడాల్సి వచ్చింది, వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం నా ముందు ఉండే లక్ష్యం. అందుకోసం చాలా కష్టపడుతాను అన్నాడు.
ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వెబ్ సిరీస్
పలు డాన్స్ రియాల్టీ షో ల్లో పాల్గొనడం ద్వారా బుల్లి తెర ద్వారా గుర్తింపు దక్కించుకున్న రాఘవ్ జుయల్ నటుడిగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల ఒక చిట్ చాట్ లో దర్శకుడు ఆర్యన్ ఖాన్ మాట్లాడుతూ రాఘవ్ జుయల్ ఒక అద్భుతమైన నటుడు, ఆయనకు మంచి పాత్రలు వస్తే తప్పకుండా అద్భుతంగా నటిస్తాడు, ఎంత పెద్ద పాత్రలో అయినా లీనం అయ్యి చేస్తాడు, ఆ పాత్రకు న్యాయం చేస్తాడు అన్నాడు. రాఘవ్ జుయల్ ను స్వయంగా ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారుఖ్ ఖాన్ చేయబోతున్న ఒక సినిమా కోసం రిఫర్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షారుఖ్ సినిమాలో రాఘవ్ నటిస్తే తప్పకుండా బాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
