షారూక్ ఖాన్ కొడుకు తొలి వెబ్ సిరీస్.. రెస్పాన్స్ ఎలా ఉంది?
ఆయన తెరకెక్కించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది.
By: M Prashanth | 19 Sept 2025 1:32 PM ISTబాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అరంగేట్రం చేశాడు. ఆయన తెరకెక్కించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సిరీస్ కు మిశ్రమ స్పందన వస్తోంది. సిరీస్ గ్రాండ్ గా ప్రారంభమై.. సాగుతున్నా కొద్దీ చివరి ఎపిసోడ్లలో కొంత నిరుత్సాహ పర్చింది. సిరీస్ కాస్త లాగ్ అయినట్లు ఆడియెన్స్ భావిస్తున్నారు.
ఇక పాజిటివ్ ఏంటంటే సిరీస్ లో క్యామియో, క్యారెక్టర్లు, డైలాగులు కొత్త అనుభూతిని ఇచ్చాయి. కానీ, స్టార్ నటులు మోనా సింగ్, గౌతమీ కపూర్ లాంటి వాళ్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారన్నది మరికొందరి వాదన. ఇక ఈ సిరీస్ లో క్లైమాక్స్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రారంభ ఎపిసోడ్స్ లో కాస్త మంచి ఇపాక్ట్ క్రియేట్ చేసుకున్నా.. అది క్లైమాక్ వల్ల స్పాయిల్ అయిపోయింది. అది సిరీస్ మొత్తం మీద ప్రభావం చూపించింది.
ఈ సీరీస్ బాలీవుడ్ పై సెటైర్ తో కూడిన స్టోరీలాగా ఉంది. కానీ, డైరెక్టర్ హిందీ సినిమా మూలా దాకా పూర్తిగా లోతుగా వెళ్లలేదు. రాఘవ్ జుయాల్ ప్రదర్శన అద్భుతంగానే ఉంది. కానీ బాబీ దేవోల్ పై అంచనాలు అందుకోలేదు. ఆయనపై సిరీస్ రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అవి అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే బాలీవుడ్ సినిమాల నుంచి అనేక రిఫరెన్స్ లు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో ఉన్నాయి.
ఉదాహరణకు నెపోటిజం, విమర్శల గురించి ప్రస్తావన ఉంది. అయితే, ఈ సీరీస్ లో కొత్తగా చెప్పేదేమీ లేకపోవడం, ముఖ్యంగా హిందీ సినిమా గురించి ఇప్పటికే తెలిసిన అంశాలను మాత్రమే ప్రస్తావించడం, ప్రేక్షకుల నిరాశకు కారణమయ్యాయి. ఇది కొద్దిగా ఫన్ అండ్ ఏడు ఎపిసోడ్ ల సీరియస్ డ్రామాగా ఉంది. ఎక్కువ ఎపిసోడ్ లు సీరియస్ టోన్ లోనే ఉన్నాయి. దీంతో దీనిపై నెటిజల్ భిన్నంగా స్పందిస్తున్నారు.
కొందరు ఇది డీసెంట్ గా ఉందని అంటుండగా.. ఇది ఎక్కువ ఎపిసోడ్ ల కారణంగా అంచనాలు అందుకోలేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఓవరాల్ గా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సీరీస్ లో కొత్తగా ఏమీ లేదు. అలాగే లెంగ్త్ ఎపిసోడ్స్, హిందీ ఆడియెన్స్ కు తెలిసిన టాపిక్ అవ్వడం దీనికి ప్రతికూలత అని చెప్పుకోవచ్చు.
