Begin typing your search above and press return to search.

షారుక్ కొడుకు డెబ్యూ ట్రైలర్ రిలీజ్.. మన జక్కన్న కూడా..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్ బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌.

By:  M Prashanth   |   9 Sept 2025 9:32 AM IST
షారుక్ కొడుకు డెబ్యూ ట్రైలర్ రిలీజ్.. మన జక్కన్న కూడా..
X

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్ బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌. హిందీ సినీ పరిశ్రమపై రూపొందిస్తున్న ఆ సిరీస్‌ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏడు ఎపిసోడ్ ల ఆ సిరీస్ ను చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై గౌరీ ఖాన్ నిర్మించారు.

అయితే బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ ట్రైలర్ గత నెలలో ప్రివ్యూ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అఫీషియల్ గా బయటకు వచ్చింది. ట్రైలర్ బట్టి.. వెబ్ సిరీస్ ఆస్మాన్ సింగ్ (లక్ష్య) అనే యాక్టర్ చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో, తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. స్టార్‌ గా ఎదగడానికి చూస్తుంటాడు.

ఆ సమయంలో అతడికి పలు సవాళ్లు ఎదురవుతాయి. బాలీవుడ్ లో ఔట్ సైడర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? యాక్టర్స్ ఈగోలు ఎలా ఉంటాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలే సిరీస్ గా తెలుస్తోంది. బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ తెర వెనుక పరిస్థితులకు కళ్లకు కట్టేలా సాగనుందని అర్థమవుతోంది. ట్రైలర్‌ లో యాక్షన్ సన్నివేశాలు, సరదా క్షణాలు, భావోద్వేగ సన్నివేశాల సమతుల్యత ఉంది.

అదే సమయంలో ట్రైలర్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ రీ యూనియన్ కూడా ఉంది. ఒక సీన్‌ లో దర్శకధీరుడు రాజమౌళితో అమీర్ ఖాన్ ఒక సీన్ గురించి డిస్కస్ చేస్తూ కనిపించారు. ట్రైలర్ లో మన జక్కన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సౌత్ వర్సెస్ నార్త్ డిస్కషన్ ను వడాపావ్, ఇడ్లీ సాంబార్ అంటూ చెప్పిన అమీర్ ఖాన్ డైలాగ్ బాగుంది.

రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్, బాద్ షా, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కూడా సిరీస్ లో అతిథి పాత్రల్లో నటించారు. సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయంగా.. అరిజీత్ సింగ్ పాడిన బద్లీ సీ హవా హై సాంగ్ కూడా ఇప్పటికే రిలీజైంది. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే సిరీస్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాలుగా ఓ నటుడిగా ఏలుతున్న షారుక్ ఖాన్ కొడుకు హీరోగా కాకుండా డైరెక్టర్ గా వెబ్ సిరీస్ తీయడం అందరిలో ఎంతో ఆసక్తి రేపుతోంది. సిరీస్ వైపు ఫోకస్ కూడా మల్లుతోంది. మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ రానున్న సిరీస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.