Begin typing your search above and press return to search.

20 నిమిషాల్లో జరిగిపోయింది.. రాజమౌళి, అమీర్ పాత్రలపై నటి ఏమన్నారంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. ఆర్యన్ ఖాన్ తొలి ప్రయత్నంలో భాగంగా చేసిన వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'.

By:  Madhu Reddy   |   27 Sept 2025 9:00 PM IST
20 నిమిషాల్లో జరిగిపోయింది.. రాజమౌళి, అమీర్ పాత్రలపై నటి ఏమన్నారంటే?
X

ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నిజానికి ఇండస్ట్రీలోకి రాకముందే రేవ్ పార్టీలో దొరికిపోయిన ఆర్యన్ ఖాన్ ఆ తర్వాత బయటపడి ఇప్పుడు డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నారు. అలా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గానే అడుగుపెట్టిన ఈయన.. తాజాగా ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించి అందరిని అబ్బురపరిచారు. వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు ఆర్యన్ ఖాన్ టాలెంట్ కి ఫిదా అవుతున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటనను నటి అన్య సింగ్ గుర్తు చేసుకోవడంతో ఆర్యన్ ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఆర్యన్ ఖాన్ తొలి ప్రయత్నంలో భాగంగా చేసిన వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. బాలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన హీరో జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్ లో భాగం అవ్వడమే కాకుండా దిగ్గజ దర్శకుడు రాజమౌళి, హీరో అమీర్ ఖాన్ లాంటి వాళ్లు కూడా అతిథి పాత్ర పోషించేసరికి ఈ వెబ్ సిరీస్ కి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ లభించింది.

అయితే తాజాగా రాజమౌళి, అమీర్ ఖాన్ పాత్రలపై ఊహించని కామెంట్లు చేశారు ప్రముఖ నటి అన్య. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 20 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది అంటూ ఊహించని కామెంట్లు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా అన్య మాట్లాడుతూ.. "ముంబైలోని ఒక స్టూడియోలో మేము ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ చేస్తున్నాము. అయితే అనుకోకుండా వారి ప్రాజెక్టుల కోసం రాజమౌళి, అమీర్ ఖాన్ లు ఆ స్టూడియో కి వచ్చారు

అయితే ఈ విషయం ఆర్యన్ కి తెలిసింది. తాను 20 నిమిషాల్లో ఒక సన్నివేశం రాస్తానని.. మమ్మల్ని కాస్ట్యూమ్స్ మార్చుకోమని కోరారు. అయితే మేము ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసి.. సరే ఆర్యన్ చెప్పారు కదా అని సిద్ధమై వచ్చేసరికి.. ఆర్యన్ ఖాన్ వాళ్ల కోసం అప్పటికప్పుడు కథ రాసుకొని.. వారికి వినిపించి.. వాళ్ళని ఒప్పించి.. వెంటనే షూటింగ్ కూడా చేసేసాడు.

ఇవన్నీ కూడా మాకు ఒక కలలానే అనిపించాయి. కేవలం 20 నిమిషాల్లోనే అంతటి దిగ్గజాలను ఒప్పించి షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు" అంటూ ఆర్యన్ ఖాన్ టాలెంట్ పై ప్రశంసలు కురిపించింది అన్యా సింగ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయాలు విన్న నెటిజన్స్ కూడా ఆర్యన్ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.