Begin typing your search above and press return to search.

27 ఏళ్లకే రూ.80కోట్లకు అధిపతి.. ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్, సంపాదన!

ఆర్యన్ ఖాన్ దగ్గర అద్భుతమైన కార్ కలెక్షన్ కూడా ఉంది. ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ GLS 350d, మెర్సిడెస్ బెంజ్ GLE 43AMG కూపే , BMW 730Ld ఉన్నాయి.

By:  Madhu Reddy   |   12 Oct 2025 12:23 PM IST
27 ఏళ్లకే రూ.80కోట్లకు అధిపతి.. ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్, సంపాదన!
X

ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ కాలం నుంచే సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అలా వచ్చిన వారిలో కొంతమంది హీరోలుగా.. మరికొంతమంది నిర్మాతలుగా సెటిలైపోయారు. అయితే అదే పరంపర నేటికీ కొనసాగుతోంది. అలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఇకపోతే కొంతమంది సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చాక పాపులారిటీ సంపాదించుకుంటే.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి రాకముందే క్రేజ్ దక్కించుకుంటున్నారు.

అయితే క్రేజ్ సంగతి పక్కన పెడితే.. స్టార్ కిడ్స్ సంపాదన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తులు కాకుండా స్వయంగా వారే పలు బ్రాండ్లకు ప్రమోటర్స్ గా మారి భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు కూతురు సితార ఎలా అయితే సొంతంగా సంపాదించడం మొదలుపెట్టిందో.. అలా బాలీవుడ్లో ఆర్యన్ ఖాన్ కూడా భారీగా ఆస్తులు వెనకేసుకున్నారు. ఈయన వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఇటీవల ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ అనే సిరీస్ తో దర్శకుడిగా మారారు. ఈ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అదే ఆర్యన్ ఖాన్ ఆస్తుల విలువ.. సుమారు 80 కోట్ల వరకూ ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చి దర్శకుడిగా చేసింది ఒక సినిమా మాత్రమే.. కానీ ఇంత ఆస్తి ఎలా అంటూ అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తండ్రి ఆస్తులు కాకుండా సొంతంగా ఆర్యన్ ఖాన్ ఈ రేంజ్ లో కూడబెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆర్యన్ ఖాన్ కి సంపాదన ఏ ఏ మార్గాల ద్వారా లభిస్తోంది ? ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆర్యన్ ఖాన్ వ్యాపార సంస్థలలో కూడా పెట్టుబడులు పెట్టారు. అలా ఆయన నికర ఆదాయం విలువ సుమారుగా 80 కోట్లు ఉంటుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలోని ఉన్నత స్థాయి పంచశీల పార్కులో సుమారుగా 37 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు.

ఆర్యన్ ఖాన్ దగ్గర అద్భుతమైన కార్ కలెక్షన్ కూడా ఉంది. ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ GLS 350d, మెర్సిడెస్ బెంజ్ GLE 43AMG కూపే , BMW 730Ld ఉన్నాయి.

సంపాదన మాత్రమే కాదు ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఆయన ధరించే బ్యాలెన్సియాగా స్నీకర్స్ ధర 47,000 అలాగే రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ధర 7.83లక్షలు.

ఆర్యన్ బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1997 నవంబర్ 13న జన్మించారు. యూకేలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, సెవెనోక్స్ స్కూల్లో చదువుకున్న ఈయన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చలనచిత్ర నిర్మాణాన్ని అభ్యసించారు. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వీఎఫ్ఎక్స్ లో అనుభవం సాధించిన ఆర్యన్ ఖాన్ కరోనా సమయంలో తన తండ్రి షారుక్ ఖాన్, సోదరి సుహానా ఖాన్ లతో కలిసి షార్ట్ ఫిలిం కూడా నిర్మించారు.. 2018లో జీరో సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో శిక్షణ పొందారు. 2022లో ఆర్యన్ ప్రీమియం లైఫ్ స్టైల్, ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించడం ద్వారా తన ప్రొఫైల్ ను విస్తరించుకున్నారు.