ఆర్యన్ ఖాన్ డెబ్యూ పార్టీ వీడియో వైరల్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు.
By: Ramesh Palla | 22 Aug 2025 9:00 PM ISTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన్ను హీరోగా చూడాలని ఎంతో మంది ఆశ పడ్డారు. కానీ ఆర్యన్‌కి నటనపై కంటే దర్శకత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పటికే ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. గత నాలుగు ఏళ్లుగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్న ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌ను రెడీ చేశాడు. 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' టైటిల్‌తో ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులను విభిన్నంగా చూపించేందుకు గాను దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ సరికొత్త కథను ఎంపిక చేసుకున్నాడు. ట్రైలర్ విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించారు. ఖచ్చితంగా ఇందులో మ్యాటర్ ఉంటుందని, ఆర్యన్ ఖాన్ చాలా డెప్త్‌గా బాలీవుడ్‌ను చూపించబోతున్నాడు అనిపిస్తుంది.
షారుఖ్ ఖాన్ తనయుడి డెబ్యూ
ఆర్యన్ ఖాన్ తన వెబ్ సిరీస్ పాత్రలను పరిచయం చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు ఆర్యన్ చాలా కష్టపడుతున్నాడు. చూడ్డానికి తండ్రిలాగే ఉన్న ఆర్యన్ ఖాన్ ఆ మధ్య విడుదల చేసిన వీడియోలో వాయిస్ ఓవర్ చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. షారుఖ్ ఖాన్ ఎలాగైతే డబ్బింగ్ చెబుతాడో, అలాగే అతడి మాటలు ఉండటంతో హీరోగా ఆర్యన్ నటించకపోవడంతో చాలా మిస్ అవుతామని అంటున్నారు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిందే అని బాద్ షా షారుఖ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్యన్ ఖాన్ బిజీ బిజీగా ఉంటున్నాడు.
ఆర్యన్ ఖాన్ స్నేహితులతో పార్టీ
ఇటీవల తన మొదటి వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ నేపథ్యంలో సన్నిహితులకు, స్నేహితులకు ఆర్యన్ ఖాన్ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ లో ఈ పార్టీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆర్యన్ ఖాన్ ఒక కుర్ర హీరో మాదిరిగా కనిపిస్తున్నాడు తప్ప ఎలా చూసినా దర్శకుడు కనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆర్యన్ ఖాన్ వీడియోలు ఏవి బయటకు వచ్చినా కూడా తెగ వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇతడు హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అని బాలీవుడ్ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇటీవలే ట్రైలర్ విడుదల అయిన ఈ వెబ్ సిరీస్‌ను సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ట్రైలర్‌ను షారుఖ్ ఖాన్ లాంచ్ చేశారు. కొత్తగా చేస్తున్నాను అంటూ చాలా కాలంగా ఆర్యన్ చెబుతూ ఉంటే ఏం తీస్తాడో, ఏం చేస్తాడో అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మంచి కంటెంట్‌ను తీసినట్లుగా అనిపిస్తుందని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్‌ను షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ లో యానిమల్ స్టార్ బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటించాడు. బాలీవుడ్ లో ఉన్న మంచి చెడులను ఈ వెబ్ సిరీస్‌లో చూపించడం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త విషయాలను చూపించాలని భావిస్తున్నారు. మరి ఆర్యన్ ఖాన్ ఎంత వరకు ఆ విషయంలో సఫలం అవుతాడు అనేది చూడాలి.
