సూపర్‌స్టార్ వారసుడి భవిష్యత్ తేలేది నేడే!
భారతదేశంలోని ఒక పెద్ద సూపర్‌స్టార్ వారసుడు కచ్ఛితంగా మరో స్టార్ అవుతాడని ప్రజలంతా ఎదురు చూస్తారు.
By: Sivaji Kontham | 20 Aug 2025 9:30 AM ISTభారతదేశంలోని ఒక పెద్ద సూపర్‌స్టార్ వారసుడు కచ్ఛితంగా మరో స్టార్ అవుతాడని ప్రజలంతా ఎదురు చూస్తారు. కానీ అందుకు భిన్నంగా, తాను కెమెరా వెనక దర్శకుడిగా సెటిలవుతానంటే అది నిజంగా అభిమానులందరికీ షాకిచ్చే పెద్ద విషయం. కానీ అలాంటి ఒక ధైర్యమైన సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించాడు కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్.
అతడు దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ఈ బుధవారం నాడు ప్రివ్యూకి సిద్ధమవుతున్న శుభతరుణంలో మరోసారి ఖాన్ వారసుడి వ్యవహారం గురించి ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇది ఒక బోల్డ్ వెబ్ సిరీస్ అంటున్నారు కానీ దానికి సంబంధించి కచ్ఛితమైన సమాచారం ఏదీ బయటకు లీక్ చేయలేదు. బాలీవుడ్ ప్రపంచంలోని చాలా గమ్మత్తయిన విషయాలను ఈ సిరీస్ లో రివీల్ చేస్తూనే, ఒక అందమైన ప్రేమకథను కూడా ఆర్యన్ చూపిస్తున్నాడని టాక్ ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోకి మంచి స్పందన వచ్చింది. ఇటీవల మేకర్స్ తొలి గ్లింప్‌ను విడుదల చేశారు. షారుఖ్ స్వయంగా ఈ సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ ప్రోమో గురించి మాట్లాడారు. టీజర్‌లో రొమాన్స్, యాక్షన్, డ్రామా ఆకట్టుకుంటున్నాయి. విజువల్ రిచ్ గా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారని అర్థమైంది.
ముఖ్యంగా ఆర్యన్ పనితనాన్ని పొగిడేస్తూ కరణ్ జోహార్ చాలా ఎగ్జయిట్ అయ్యాడు. ఆర్యన్ లవ్ యు.. ఇది అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది! అంటూ ఒకటే ఉత్సాహం కనబరిచాడు. అలాగే మన లక్ష్య లీడ్ పాత్రలో కిల్ చేస్తున్నాడు అని కూడా ప్రశంసించాడు. ముఖ్యంగా కింగ్ ఖాన్ తన వారసుడిని ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే వెబ్ సిరీస్ పై ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది.
షారూఖ్ వారసుడిగా ఆర్యన్ పై చాలా ఒత్తిడి ఉంది. అన్ని కళ్లు ఇప్పుడు అతడి మొదటి ప్రయత్నంపైనే.. అతడు తన తొలి వెబ్ సిరీస్ లో ఏం చూపించబోతున్నాడు? దర్శకత్వ శాఖను సవ్యంగా హ్యాండిల్ చేయగలిగాడా లేదా? అతడి నాలెజ్ స్థాయి ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలని వేచి చూస్తున్నారు. ఈ సాయంత్రానికి బహుశా `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ప్రివ్యూ నుంచి రిపోర్టులు అందేవరకూ జస్ట్ వెయిట్.. ప్రస్తుతానికి సూపర్‌స్టార్ వారసుడి భవిష్యత్ టెన్షన్స్ అలానే ఉన్నాయి.. అభిమానుల గుండెల్లో లబ్ డబ్ ..సన్నగా...!
