సంచలన వివాదంపై షాక్ ఇచ్చిన హైకోర్టు!
ఢిల్లీ నుంచే ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే గనుక ఆరకంగా పిటీషన్ దాఖలు చేయాలని..ఆ తర్వాత పరిగణలోకి తీసుకుంటామని కోర్టు పేర్కొంది. పిటీషన్ లో మార్పులకు కోర్టు అనుమతిచ్చింది.
By: Srikanth Kontham | 26 Sept 2025 7:00 PM ISTషారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` సిరీస్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓటీటీలో రిలీజ్ అయిన సిరీస్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాఖండే ఏజెన్సీల ను నెగిటివ్ గా చూపించారని, బ్యూరో అధికారి పాత్రను అభ్యంతరకర రీతిలో చూపిస్తూ చట్టాలను ఉల్లం ఘిచారని..తన పరువుకు భంగం కలిగించారని 2 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తాజాగా ఈ కేసులో సమీర్ వాఖండేకు చుక్కెదురైంది.
ఈ పిటీషన్ స్వీకరించేందుకు ఢిల్లో హై కోర్టు నిరాకరించింది. కేసులో వాఖండే తరుపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోనే ఎందుకు విచారించాలని అడగా..దానికి న్యాయవాది ఇలా బధులిచ్చారు. సిరీస్ చూసిన తర్వాత దేశంలో మిగతా అన్ని ప్రాంతాలకంటే ఢిల్లీ నుంచే ఎక్కువగా వాఖండేపై మీమ్స్ వస్తున్నాయని బధులిచ్చారు. కానీ ఈ సమాధానాన్ని కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడున్న ఫార్మెట్ లో తమ పిటీషన్ ను కోర్టు విచారించలేమని..పిటీషన్ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
ఢిల్లీ నుంచే ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే గనుక ఆరకంగా పిటీషన్ దాఖలు చేయాలని..ఆ తర్వాత పరిగణలోకి తీసుకుంటామని కోర్టు పేర్కొంది. పిటీషన్ లో మార్పులకు కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సమీర్ వాఖండే తరుపు న్యాయవాది పిటీషన్ లో మార్పులు చేసి కొత్త పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబం ధించి దర్శకుడు ఆర్యన్ ఖాన్ ఇంకా స్పందించని సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీకి రాకముందు ముంబై క్రూజ్ నౌక డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఆ కేసులో ఆర్యన్ ఖాన్ ని ఆరెస్ట్ చేసింది వాఖండే బృందమే. ఈ నేపథ్యంలో వాఖండేని టార్గెట్ చేసి సిరీస్ తీసినట్లు కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన హీరో జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? అన్న కథతో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
