నటవారసుడి ప్రియురాలు సౌండ్ లేదేమిటి?
నటవారసుడి ప్రియురాలు లారిస్సా సౌండ్ లేదేమిటి? ప్రియుడి విషయంలో హడావుడి కనిపించలేదేమి..? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
By: Sivaji Kontham | 13 Nov 2025 12:00 AM ISTబాలీవుడ్ లో నటవారసుల హవా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఏడాదికి అరడజను మంది సుమారుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నటన, దర్శకత్వంలో తమను తాము నిరూపించుకునేందుకు స్టార్ కిడ్స్ ప్రయత్నిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ నటనలో కాకుండా దర్శకత్వంలో సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన తొలి ప్రయత్నమే బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రామాను రూపొందించడం నిజంగా ఒక డ్యాషింగ్ నిర్ణయమని ప్రశంసలు కురిసాయి. `ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ పై క్రిటిక్స్ ప్రశంసలు కురిసాయి.
ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఆర్యన్ ఖాన్ పుట్టినరోజు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ శుభతరుణంలో ఆర్యన్ కి విషెస్ చెప్పిన ప్రముఖులలో నటుడు చంకీ పాండే కుమార్తె అనన్య పాండే, సంజయ్ కపూర్ కుమార్తె షానయా కపూర్ ఉన్నారు. ఇంకా పలువురు సెలబ్రిటీ కిడ్స్ ఆర్యన్ ఖాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
అయితే ఆర్యన్ పుట్టినరోజున బ్రెజిలియన్ గర్ల్ ఫ్రెండ్ లారిస్సా బోనెస్సీ విషెస్ తెలియజేసేవారి వరుసలో మొదటి స్థానంలో ఉంటుందని అంతా భావిస్తే, ఈ బ్యూటీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విషెస్ అందకపోవడం ఆశ్చర్యపరిచింది. లారిస్సా స్థానంలో అనన్య పాండే, సానయా కపూర్ వంటి భామలు ఆర్యన్ కి బర్త్ డే విషెస్ చెప్పడం గుసగుసలకు తావిచ్చింది.
ఖాన్ వారసుడు ఆర్యన్ చుట్టూ నటవారసురాళ్లే ఉన్నారు ఏమిటి చెప్మా..? అంటూ అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. నటవారసుడి ప్రియురాలు లారిస్సా సౌండ్ లేదేమిటి? ప్రియుడి విషయంలో హడావుడి కనిపించలేదేమి..? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఆర్యన్ ఖాన్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న లారిస్సా ఇంతకుముందు టాలీవుడ్ లో సాయిధరమ్ సరసన `తిక్క` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో లారిస్సాకు సాయి ధరమ్ ప్రపోజ్ చేసినా ఆమె సున్నితంగా తిరస్కరించిందని కథనాలొచ్చాయి. అయితే బ్రెజిలియన్ మోడల్ లారిస్సా ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అసైన్ మెంట్స్ తో బిజీ అయింది. కానీ ఒక స్టార్ గా మాత్రం వెలగలేకపోయింది. అదే క్రమంలో ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ చేస్తూ చర్చల్లోకి వచ్చింది. ఆర్యన్ తన ప్రియురాలు లారిస్సాకు ఖరీదైన కానుకలిచ్చాడని కూడా కథనాలొచ్చాయి.
ఆర్యన్ ఖాన్ వయసు ఈరోజు (నవంబర్ 12)తో 28 సంవత్సరాలు. అతడికి బాలీవుడ్ ప్రముఖుల నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ దర్శకుడిగా పరిచయం అయిన తర్వాత ఆర్యన్ ఇమేజ్ అమాంతం పెరిగిందని బాలీవుడ్ లో చర్చ సాగుతోంది. అతడి సోదరి సుహానా ఖాన్, అలాగే సన్నిహితుల నుంచి బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక అనన్య పాండే, షానయ కపూర్ ఖాన్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. సుహానా తన సోదరుడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఒక త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసారు. నిన్ను ప్రేమిస్తున్నాను సోదరా! అంటూ అన్నపై తన మనసును చాటుకుంది.
సుహానా ఖాన్, భావనా పాండే(సుహానా తల్లి), మహీప్ కపూర్ , షానయ కపూర్‌లతో కూడిన సరదా గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసిన అనన్య పాండే అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ``స్మైలీ, ఇది మీ పుట్టినరోజు`` అని క్యాప్షన్ ఇచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు! అని సింపుల్ గా వ్యాఖ్యానించిన షానయ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` నుండి తెరవెనుక కోల్లెజ్‌ను షేర్ చేసింది. ఆర్యన్ పుట్టినరోజు వేడుకలు బాలీవుడ్ లో తరువాతి తరంలో బలమైన స్నేహాలు, కుటుంబ సంబంధాలను అర్థమయ్యేలా చేశాయి.
