Begin typing your search above and press return to search.

మ్యాకోమ్యాన్ అవ‌తారంలో ఆర్య స‌ర్‌ప్రైజ్

తాజా స‌మాచారం మేర‌కు.. అత‌డు త‌న తాజా చిత్రం కోసం మ్యాకో రూపాన్ని సిద్ధం చేసాడు. పా రంజిత్ తెర‌కెక్కిస్తున్న `వెట్టువం` ఈరోజు కరైకుడిలో షూటింగ్ ప్రారంభమైంది.

By:  Sivaji Kontham   |   30 Oct 2025 10:52 PM IST
మ్యాకోమ్యాన్ అవ‌తారంలో ఆర్య స‌ర్‌ప్రైజ్
X

కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టించాడు త‌మిళ హీరో ఆర్య‌. ఆరంభ‌మే అల్లు అర్జున్ `వ‌రుడు`లో విల‌న్ పాత్ర‌తో ఆక‌ట్టుకున్నాడు. బాలా తెర‌కెక్కించిన వాడు వీడులో అత‌డి ర‌గ్‌డ్ పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అట్లీ తెర‌కెక్కించిన `రాజా రాణి`లో లైట‌ర్ వెయిన్ ప్రేమికుడి పాత్ర చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. అత‌డు భారీ యాక్ష‌న్ చిత్రాల కోసం మేకోవ‌ర్ ట్రై చేసిన‌ తీరు ప‌లుమార్లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

తాజా స‌మాచారం మేర‌కు.. అత‌డు త‌న తాజా చిత్రం కోసం మ్యాకో రూపాన్ని సిద్ధం చేసాడు. పా రంజిత్ తెర‌కెక్కిస్తున్న `వెట్టువం` ఈరోజు కరైకుడిలో షూటింగ్ ప్రారంభమైంది. గెతు దినేష్ కథానాయకుడిగా నటించగా, ఆర్య శక్తివంతమైన విలన్ గా నటించే అవకాశం ఉంది. ఈ కథ మాయా ప్ర‌పంచంలో వాస్తవికత ఏమిట‌న్న‌ది చూపిస్తుంది. ఇందులో గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది!

సోష‌ల్ మీడియాలో ఆర్య మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ యూత్ లో గుబులు పుట్టిస్తోంది. అత‌డు త‌న పాత్ర కోసం ఎంత హార్డ్ వ‌ర్క్ చేస్తాడో ఈ లుక్ చూడ‌గానే అర్థం చేసుకోవ‌చ్చు. అత‌డు జిమ్ లో బాగా క‌స‌ర‌త్తులు చేసి పహిల్వాన్ లా మారాడు. ఈ మేకోవ‌ర్ నెవ్వ‌ర్ బిఫోర్. అత‌డి హెయిర్ క‌ట్, మెలితిరిగిన కండ‌లు ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తున్నాయి.