Begin typing your search above and press return to search.

18 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసిన నో కిస్సింగ్ రూల్ ఎందుకో చెప్పేసింది

By:  Tupaki Desk   |   16 Jun 2023 4:30 PM IST
18 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసిన నో కిస్సింగ్ రూల్ ఎందుకో చెప్పేసింది
X
ఒక గ్లామర్ హీరోయిన్ 18 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండటం.. అందునా నో కిస్సింగ్ రూల్ పెట్టుకొని అగ్రనటిగా కొనసాగటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో తమన్నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరేమో? కెరీర్ ప్రారంభంలో కొన్ని షరతులతో ఇండస్ట్రీకి వచ్చినా.. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా.. సినిమాల్లోపాత్ర డిమాండ్ మేరకు ఓకే చెప్పేయటం ఉంటుంది. అలాంటిది తమన్నా మాత్రం తన నో కిస్సింగ్ రూల్ కు మాత్రం ఇప్పటివరకు కట్టుబడే ఉంది.

తాజాగా లస్ట్ స్టోరీస్ 2 కోసం మాత్రం ఆమె ముద్దు సీన్ లో నటించేందుకు ఓకే చేయటం ఆసక్తికరంగానే కాదు.. తమన్నా మొదటిసారి మారిందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ ఆమె తన నో కిస్సింగ్ రూల్ ను ఎందుకు బ్రేక్ చేసిందో చెప్పుకొచ్చింది. ఒకప్పటి పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు చాలానే మార్పులు వచ్చాయని.. కాలానికి అనుగుణంగా మారే వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని చెప్పారు.

ఒక నటిగా క్రియేటివిటీలో భాగంగానే తాను కిస్సింగ్ సీన్ చేసేందుకు ఓకే చెప్పినట్లుగా పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్ కావాల్సిన అవసరం లేదంటూ.. సన్సేషన్ కోసం తాను కిస్సింగ్ సీన్ లో నటించలేదన్న విషయాన్ని తేల్చేసింది.

లస్ట్ స్టోరీస్ 2లో వర్కు చేయటం వల్ల ఇంటిమేటెడ్ సీన్ల విషయంలో అపోహలు తొలిగినట్లుగా చెప్పారు. నెట్ ఫ్లిక్స్ లో గతంలో విడుదలైన లస్ట్ స్టోరీస్ ప్రేక్షకాదరణ పొందటంతో తాజాగా దాని సీక్వెల్ నిర్మిస్తున్నారు.

మొత్తం నాలుగు ఎపిసోడ్లతో రూపొందిస్తున్న లస్ట్ స్టోరీస్ 2లో అమ్రత సుభాష్.. కాజోల్.. మ్రణాల్ ఠాకూర్.. నీనాగుప్తా తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న విజయ్ వర్మతో తాను సన్నిహితంగా ఉన్న విషయాన్ని రివీల్ చేసిన తమన్నా.. అతడు తననుచాలా జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. అతడితో తన రిలేషన్ ను కన్ఫమ్ చేయటం తెలిసిందే.