Begin typing your search above and press return to search.

అనుష్క సినిమాలో స్టార్ హీరో సాంగ్..!

By:  Tupaki Desk   |   8 May 2023 10:59 AM GMT
అనుష్క సినిమాలో స్టార్ హీరో సాంగ్..!
X
స్టార్ హీరోలు ఈమధ్య కేవలం నటించడమే కాదు మిగతా విభాగాల్లో కూడా తమ ప్రతిభ చూపిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు హీరోలు గానే కాదు నిర్మాతలుగా.. సింగర్ గా.. డైరెక్టర్స్ గా ఇలా తమ టాలెంట్ చూపిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ పక్క అవార్డ్ విన్నింగ్ సినిమాలు చేస్తూనే మరోపక్క సింగర్ గా కూడా తన గొంతు సవరించుకుంటున్నారు. శింబు కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతున్న విషయం తెలిసిందే. అయితే శింబు కన్నా ధనుష్ రెగ్యులర్ గా పాటలు పాడుతూ వస్తున్నాడు.

లేటెస్ట్ గా అనుష్క సినిమా కోసం మరోసారి ధనుష్ తన గాత్ర మాధుర్యాన్ని వినిపించబోతున్నాడట. నవీన్ పొలిశెట్టి హీరోగా అనుష్క ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాలో ధనుష్ స్పెషల్ సాంగ్ పాడుతున్నాడని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కు ధనుష్ రెండు భాషల్లో కూడా ఈ పాటను తనే పాడుతున్నాడట. ఒకప్పుడు వై దిస్ కొలవెరి డీ అంటూ ప్రపంచాన్ని షేక్ చేసిన ధనుష్ తన సింగింగ్ టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్నారు.

నవీన్, అనుష్క సినిమా కు ధనుష్ సాంగ్ స్పెషల్ క్రేజ్ ఏర్పరుస్తుందని చెప్పొచ్చు. కొంతకాలం గ్యాప్ తర్వాత అనుష్క.. జాతిరత్నాలు సక్సెస్ తర్వాత నవీన్ ఇద్దరు కలిసి ఈ సినిమా చేయడం విశేషం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించింది. తప్పకుండా యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఈ ప్రాజెక్ట్ వస్తుందని అంటున్నారు. ధనుష్ సాంగ్ కూడా ఉంది కాబట్టి సినిమాకు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.

సార్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ధనుష్ హీరో గానే కాదు సింగర్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. సార్ తర్వాత శేఖర్ కమ్ములతో ధనుష్ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది.