Begin typing your search above and press return to search.

1500 మంది డాన్స‌ర్ల మ‌ధ్య‌లో స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   27 Jun 2023 8:00 PM GMT
1500 మంది డాన్స‌ర్ల మ‌ధ్య‌లో స్టార్ హీరో!
X
కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పిరియాడిక్ చిత్రం 'కంగువ' తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామ‌గా తెర‌కెక్కుతోన్న సినిమాలో సూర్య కొత్త లుక్ లో చూపించ బోతున్నారు.

సాహ‌సోపేత‌మైన ఇన్నోవేటివ్ స్టోరీలు ప‌డితే సూర్య చెల‌రేగిపోతాడ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. 'కంగువా' కోసం అలాగే ప‌నిచేస్తున్నాడు. పైగా హిట్ కాంబో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడొస్తాయా? అని ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ఓ కీల‌క అప్ డేట్ అందింది. ఇంద‌లో ఓ పాట‌ని ఏకంగా 1500 మంది డాన్స‌ర్ల‌తో చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఆ పాట షూట్ ఆగ‌స్టులో చేస్తార‌ని తెలిసింది. అయితే ఈ పాట ఓ పెన్ గ్రౌండ్ లో షూట్ చేయాలా? సెట్ చేయాలా? అన్న దానిపై సందిగ్ద‌త నెల‌కొంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతుందిట‌. అది పూర్త‌యిన త‌ర్వాత ఎక్క‌డ చిత్రీక‌రించాలి అన్న దానిపై క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుస్తుంది.

అలాగూ ఈ పాట‌లో 1500 మంది డాన్స‌ర్ల‌తో పాటు ప్ర‌ధాన తారాగణ‌మంతా పాల్గొంటారుట‌. సూర్య‌..దిశా ప‌టానీ..యోగిబాబు..కోవై స‌ర‌ళ‌..ఆనంద్ రాయ్ స‌హా ప‌లువురు పాల్గొంటార‌ని తెలుస్తుంది. మ‌రి ఈ భారీత‌నంతో కూడిన పాట ప్ర‌త్యేక‌త ఏంటి? అన్న‌ది తెలియాలి. ఇటీవ‌లి కాలంలో సాంగ్ షూట్ కోసం కొరియోగ్రాఫ‌ర్లు భారీ ఎత్తున డాన్స‌ర్ల‌ని రంగంలోకి దించుతున్నారు. అందుకోసం ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మిస్తున్నారు.

కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. పాట‌ల్లో భారీత‌నం సాధార‌ణంగా శంక‌ర్ సినిమాల్లోనే క‌నిపిస్తుంది. కానీ ఈ మ‌ధ్య చాలా మంది మేక‌ర్స్ శంక‌ర్ త‌ర‌హాలోనే పాట‌ల్ని హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోల చిత్రాల్లోనూ ఈ భార‌త‌నం క‌నిపిస్తుంది. ఏ హీరో సినిమా చేసినా ఏదో పాట‌లో క‌నీసం 500 మంది డాన్స‌ర్లు ఉన్న ఒక్క పాటైన చేస్తున్నారు.