Begin typing your search above and press return to search.
గాళ్ ఫ్రెండ్ చెప్పులు మోస్తూ కెమెరాకి చిక్కిన స్టార్ హీరో
By: Tupaki Desk | 5 April 2023 9:24 AM GMTఆలితో పెట్టుకుని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అలుసైపోయాడు. సామాన్యులు ఇంకెక్కడ నిలబడతారు? స్టార్ హీరోలు అయినా పెళ్లాం చెప్పులు మోయాల్సిందే. ఇంకా పెళ్లి అయినా అవ్వకుండానే ఆలిని అధికారికం చేసుకోక ముందే గాళ్ ఫ్రెండ్ చెప్పులు మోస్తూ సదరు స్టార్ హీరో ఇదిగో ఇలా అడ్డంగా దొరికిపోయాడు. కెమెరా కళ్లు అతడిని బుక్ చేసేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవరు? గాళ్ ఫ్రెండ్ ఎవరు? అంటే.. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ - సబా ఆజాద్ జంట గురించే. గత ఏడాది కాలంగా ఈ జంట నిండా ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. ఔటింగులు బ్రంచ్ లు ఔటర్ లో షికార్లతో పాటు విదేశీ విహారయాత్రలు జంటగా రోడ్ ట్రిప్ లతో నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది ఈ జంట.
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలోను ఈ ప్రేమ జంట ప్రత్యక్షమైంది. గ్రీక్ గాడ్ గా పిలవబడే బాలీవుడ్ స్టార్ హీరో ఎలాంటి భేషజానికి పోకుండా తన గాళ్ ఫ్రెండ్ సబా అజాద్ చెప్పులు మోసాడు. హై హీల్స్ ని చేత్తో పట్టుకుని సహచరులతో మాట్లాడుతూ కనిపించిన హృతిక్ రోషన్ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది.
అయితే అతడు తన కాబోయే భార్య కు ఇచ్చిన గౌరవం ప్రేమకు ఇది మీనింగ్ అంటూ పలువురు నెటిజనులు ప్రశంసిస్తున్నారు. ఇంటర్నెట్ లో హృతిక్ ను నిజమైన పెద్దమనిషి అని పిలుస్తున్నారు. సబా ఆజాద్ తో గ్రీక్ గాడ్ నిజమైన ప్రేమలో ఉన్నాడని చాలా మంది వ్యాఖ్యానించారు. కానీ ఈ ఫోటో వీక్షించాక హృతిక్ మహిళా అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని ఇలా అవమానిస్తుందా సబా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ముంబై నగరంలో అన్ని పెద్ద ఈవెంట్లలో హృతిక్ - సబా ఆజాద్ జంటగా కలిసి కనిపిస్తున్నారు. తమ మధ్య బంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. త్వరలోనే ఈ జంట వివాహం జరగనుందని కథనాలొస్తున్నాయి. NMACC ఈవెంట్లో ఈ జోడీ అందమైన నలుపు - ఎరుపు దుస్తులలో కలిసి కనిపించారు. 'ఎరుపు రంగులో ఉన్న మహిళతో' అని క్యాప్షన్ ఇస్తూ ఈ ఫోటోని హృతిక్ స్వయంగా పోస్ట్ చేయడం ఇక్కడ విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.