Begin typing your search above and press return to search.
మిస్టర్ తో వైట్లకు వైట్ వాష్
By: Tupaki Desk | 27 Sep 2017 5:01 PM GMTస్టార్ డైరెక్టర్ రేంజ్ నుంచి మీడియం రేంజ్ సినిమాలకు వచ్చి.. ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ దర్శకుడితో ఒక్క సినిమా అయినా చేయాలని తపన పడ్డ హీరోలు ఒకప్పుడు ఉండగా.. తనకు మళ్లీ ఛాన్స్ ఇచ్చే హీరోను వెతుక్కోవాల్సిన సిట్యుయేషన్ కు ఈ దర్శకుడు రావడానికి కారణం.. మహేష్ తో ఆగడు.. రామ్ చరణ్ తో బ్రూస్ లీ.. వరుణ్ తేజ్ తో మిస్టర్.. చిత్రాలే కారణం. ఇప్పుడు రవితేజతో ఓ మూవీ ఖాయమైందనే టాక్ ఉంది కానీ.. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటైల్స్ వెల్లడి కాలేదు.
అయితే.. ఆగడు.. బ్రూస్ లీ చిత్రాల సంగతేమో కానీ.. మిస్టర్ మాత్రం శ్రీనువైట్లను వైట్ వాష్ చేసేసిందనే టాక్ ముందునుంచి వినిపిస్తూనే ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేయించేయడమే.. మిస్టర్ మూవీ దారుణమైన రిజల్ట్ ను ఫేస్ చేయడానికి కారణం అంటారు ఇండస్ట్రీ జనాలు. మినిమం బడ్జెట్ లో తీసి ఉంటే సేఫ్ ప్రాజెక్ట్ అయే అవకాశాలు ఉన్నాయని కూడా అంటారు. కానీ మిస్టర్ ప్రొడ్యూసర్స్ మాత్రం భారీగా నష్టపోయిన మాట వాస్తవమే. ఎంతలా అంటే.. ఆ నష్టంలో వైట్ల కూడా వాటా తీసుకోవాల్సిందే అని పట్టు పట్టేటంతగా అని చెబుతున్నారు.
తాను నిర్మాతలను నష్టపరచడంతో.. మిస్టర్ ప్రొడ్యూసర్స్ కు రీసెంట్ గానే 85 లక్షలు వైట్ల ముట్టచెప్పాడనే టాక్ సెన్సేషన్ అవుతోంది. సినిమా భారీ ఫ్లాప్ అయితే.. హీరోలు అంతో ఇంతో వెనక్కు ఇవ్వడం అప్పుడప్పుడు కనిపిస్తుంది. కొన్ని సార్లు తర్వాతి సినిమాలను తక్కువ రేటుకు ఇస్తుంటారు. కానీ ఓ దర్శకుడు కాంపెన్సేట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం వైట్లకే వచ్చిందట. ఇదే మాట వాస్తవం అయితే మాత్రం.. ఇకపై భారీ బడ్జెట్ తోనే సినిమాలు చేస్తామని పట్టుబట్టే దర్శకులపై.. నిర్మాతలు ఇలాంటి రిటర్న్ బేస్డ్ అగ్రిమెంట్స్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.