Begin typing your search above and press return to search.

వార‌సుడికి లాస్ ఏంజెల్స్‌ లో శిక్ష‌ణ‌

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:15 AM GMT
వార‌సుడికి లాస్ ఏంజెల్స్‌ లో శిక్ష‌ణ‌
X
న‌ట‌వార‌సుల వెల్లువ‌లో వార‌స హీరోలపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌ లో ఇప్ప‌టికే వార‌సుల హ‌వా న‌డుస్తోంది. జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా వార‌సుల్ని హీరోలుగా నిల‌బెట్టేందుకు తండ్రులు చేస్తున్న కృషిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి టైమ్‌ లో శ‌తాధిక చిత్రాల హీరో త‌న పుత్ర ర‌త్నాల్ని హీరోలుగా షైన‌ప్ చేసేందుకు చాలానే కృషి చేస్తున్నారు.

పెద్దోడు రోష‌న్ - చిన్నోడు రోహ‌న్ ప‌క్కాగా శిక్ష‌ణ తీసుకుని మ‌రీ బ‌రిలో దిగుతున్నారు. అస‌లు మీ అబ్బాయిల్ని ఎప్పుడు దించుతారు? అని మీడియా నేరుగా శ్రీ‌కాంత్‌ నే ప్ర‌శ్నిస్తే ఆయ‌న `ఆప‌రేష‌న్ 2019` ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వివ‌రాల్ని అందించారు. శ్రీ‌కాంత్ మాట్లాడుతూ-``మా అబ్బాయిల గురించి చెప్పాలంటే.. చిన్న‌బ్బాయి రోహ‌న్ ప్ర‌భుదేవా కొడుకు గా ఓ సినిమా చేస్తున్నాడు. పెద్ద‌బ్బాయి రోష‌న్‌ లాస్ ఏంజెల్స్ లో కోర్సులు పూర్తి చేసుకుని వ‌చ్చాడు. ఇంకా త‌న గురించి ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేస్తాడు`` అని అన్నారు. ఇంత వ‌య‌సు బార్ అయినా అంత గ్లామ‌ర్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? అని ప్ర‌శ్నిస్తే.. నేను ఏ టెన్ష‌న్సూ తీసుకోను. స్విచ్ ఆఫ్‌ - స్విచ్ ఆన్ చేయ‌డం నాకు బాగా తెలుసు. అందుకే కాస్త ఫ్రెష్‌ గా క‌నిపిస్తాన‌ని అన్నారు. పైగా ఈ మ‌ధ్య మూడు కిలోలు త‌గ్గాన‌ని శ్రీ‌కాంత్ చెప్పారు.

ఆప‌రేష‌న్ 2019 చిత్రం 2.ఓకి పోటీగా దించుతున్నారా? అని ప్ర‌శ్నిస్తే.. ఇది 2. ఓ కు పోటీకాదు .. అయినా పెద్ద సినిమా వ‌స్తున్నా ఏమ‌వుతుంది? ఇంత‌కు ముందు కూడా ఇలాంటివి చాలా సార్లు జ‌రిగాయి. ఏది బావుంటే అది ఆడుతుంది. అయినా రోబో 2.ఓ సినిమా తరువాత రెండు రోజులకు వస్తున్నాం.. అనీ అన్నారు. తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. వ‌రుస‌గా చాలానే ఉన్నాయి. `తెలంగాణ దేవుడు` - `మార్ష‌ల్‌`.. సెట్స్‌ లో ఉన్నాయి. ఈ మధ్య రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా చేస్తున్నానని రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు .. నాకు అలాంటి ఉద్దేశం ఏమిలేదు .. కాకపోతే రాజకీయాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత ... అని శ్రీ‌కాంత్ అన్నారు.