Begin typing your search above and press return to search.

శ్రీలీల దెబ్బకి బేజారవుతున్న కృతి

By:  Tupaki Desk   |   2 March 2023 9:00 PM GMT
శ్రీలీల దెబ్బకి బేజారవుతున్న కృతి
X
టాలీవుడ్లో హీరోలు వాళ్లే ఉంటారు కానీ... హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. హీరోయిన్ వచ్చి దాదాపు కొన్నేళ్లు అవుతుందంటే.. ఆమె క్రేజ్ తగ్గిపోవడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సమయంలో సీనియర్ భామల హడావిడి తగ్గిపోతున్న క్రమంలో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో నటించిన ఆమె ఆ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకోవడంతో ఇక ఆమె ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ భావించారు.

కానీ ఆమె అనుహ్యాంగా ఉప్పెన తర్వాత ఒక్క హిట్టు కూడా దక్కలేదు. అయితే ఈ భామకు త్వరలోనే మరిన్ని అవకాశాలు దక్కుతాయని అందరూ భావిస్తున్న తరుణంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. కృతి శెట్టి ఎలా అయితే మంగళూరు నుంచి ఎంట్రీ ఇచ్చిందో... శ్రీలీల కూడా బెంగళూరు నుంచి ఎంట్రీ అయితే తెలుగు నేటివిటీ ఉన్న అమ్మాయి కావడం.. తల్లిదండ్రులు తెలుగువారు కావడంతో శ్రీలీలకు అదనపు బలం తోడైనట్లైంది. ప్రత్యేకంగా తెలుగు నేర్పాల్సిన అవసరం లేకపోవడంతో పాటుగా ఆమె చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలుస్తుందనే పక్షంలో ఆమెకు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో కృతి శెట్టి రావాల్సిన ఆఫర్లను సైతం ఈ భామ అందుకుంటుంది.

అలా వరుస అవకాశాలతో శ్రీ లీల దూసుకుపోతోంది. అలాగే కృతి శెట్టి ప్రతి విషయానికి తన తల్లిని తీసుకురావడం అన్నిట్లో ఆమెదే డామినేషన్ అవడంతో పాటు రెమ్యూనరేషన్ మీద పెట్టిన శ్రద్ధలో కొంత కూడా సినిమా పెర్ఫార్మెన్స్ మీద పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన క్రమంలోనే ఆమెను ఇప్పుడు పక్కన పెడుతున్నారని తెలుస్తోంది.

శ్రీ లీల కమర్షియల్ సినిమాలే చేసినా డాన్స్ పెర్ఫార్మెన్స్ తనదైన క్యూట్నెస్ లుక్స్ తో.. తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ భామ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. కానీ అవి నిజమైతే మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఆమెకి ఉన్నాయని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.