Begin typing your search above and press return to search.

వ్యూస్ లెక్కలో స్పైడర్ తొక్కేసింది

By:  Tupaki Desk   |   2 Jun 2017 1:52 PM GMT
వ్యూస్ లెక్కలో స్పైడర్ తొక్కేసింది
X
ఇప్పుడు మిలియన్ వ్యూస్ సాధించడం అనేది పెద్ద విషయంగా కనిపించట్లేదు. జనాల దగ్గర ఇంటర్నెట అనేది చాలా ఎక్కువగా అందుబాటలో ఉండటం.. అలాగే ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు కలిగియుండటంతో.. ఒకరే మూడు రకాల డివైస్ ల నుండి మూడు డిఫరెంట్ కనక్షన్స్ నుండి ఒక ట్రైలర్ ను వీక్షిస్తే.. ఆటోమ్యాటిక్ గా కౌంట్ పెరుగుతుంది. అందుకే పెద్ద హీరోలు ఇప్పుడు మిలియన్ నుండి తమ స్థాయిని భారీ దిశగా తీసుకెళ్తున్నారు.

అల్లు అర్జున్ సరైనోడు సినిమా హిందీ వర్షన్ యుట్యూబ్ లో ప్రభంజనం సృష్టించి ఇండియాలోనే రికార్డు సృష్టించాక.. ఇప్పుడు అక్కడ నుండి మహేష్‌ బాబు అందుకున్నాడు. మరోసారి తెలుగు హీరోల స్టామినా చాటిచెప్పేస్తున్నాడు. ''స్పైడర్'' సినిమా టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 6.3 మిలియన్ వ్యూస్ సాధించింది. యుట్యూబ్ లో స్పైడర్ టీజర్ 5.3 మిలియన్ వ్యూస్ సాధించగా.. ఫేస్ బుక్ వీడియో ఒక 1 మిలియన్ వ్యూస్ సాధించినట్లు ఇప్పుడు ఈ సినిమా మేకర్లు ఆఫీషియల్ గా ప్రకటించారు.

ఇప్పటివరకు మన సౌత్ లో వచ్చిన టీజర్లలో.. వివేగం సినిమాకు యుట్యూబ్ + ఫేస్ బుక్ వ్యూస్ కలుపుకుంటే.. 24 గంటల్లో 6.09 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తరువాత కబాలి సినిమాకు 5.1 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు.. స్పైడర్ పిఆర్ వర్గాలు ఒక స్టేట్మెంట్లో పేర్కొన్నాయి. మొత్తానికి వ్యూస్ లెక్కల్లో స్పైడర్ అన్ని పెద్ద సినిమాలను తొక్కేసి టాప్ లోకి వచ్చేసిందనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/