Begin typing your search above and press return to search.
పుకార్ల పై క్లారిటీ ఇచ్చేసిన స్పై నిఖిల్
By: Tupaki Desk | 22 Jun 2023 10:54 PM GMTనిఖిల్ నటించిన 'స్పై' విడుదల వాయిదా పడుతోందని పుకార్లు షికార్ చేసాయి. నిఖిల్ కి దర్శకనిర్మాతలతో మనస్ఫర్థలు వచ్చాయని అందుకే ఈ చిత్రానికి ఆయన డబ్బింగ్ కూడా చెప్పడం లేదని చిత్రీకరణకు సంబంధించి పెండింగ్ మిగిలి ఉందని కథనాలొచ్చాయి. కానీ ఇవేవీ నిజాలు కావని నేడు నిఖిల్ తన వ్యాఖ్యల ద్వారా క్లారిటీనిచ్చారు. స్పై ట్రైలర్ లాంచ్ లో నిఖిల్ ఏమన్నారంటే...
విడుదల తేదీని వాయిదా వేయమని నిర్మాతలను అభ్యర్థించడం తనకు ఆందోళన కలిగించే విషయమని నిఖిల్ స్వయంగా అన్నారు. దాదాపు 2000 మంది ఈ చిత్రానికి పని చేసారు. కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. తక్కువ నాణ్యత మనందరిపై ప్రభావం చూపుతుంది కాబట్టి అవుట్ పుట్ గురించి నేను ఆందోళన చెందుతాను.
కానీ నిర్మాతలు సినిమా చూపించి నన్ను సంతృప్తిపరిచారు. దర్శకుడు కూడా నన్ను చాలా సంతృప్తిపరిచారు. ఆ కారణంగానే ఈరోజు నేను కాస్త ఆలస్యమైనా ప్రెస్ మీట్ కి వచ్చి ప్రమోట్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను'' అని ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో నిఖిల్ అన్నారు.
ప్రేక్షకుడు ఒక్కో టిక్కెట్ పై దాదాపు రూ.250 ఖర్చు చేస్తున్నాడు. సినిమా నాణ్యత తక్కువగా ఉందని అతను భావిస్తే మార్నింగ్ షో తర్వాత థియేటర్లలో రద్దీ ఉండదు. టిక్కెట్టు డబ్బులు వృధా అయ్యాయని ప్రజలు భావించకూడదు.. అని నిఖిల్ వ్యాఖ్యానించారు.
అతడి వ్యాఖ్యల్ని బట్టి తన సినిమా నాణ్యత పరంగా ఏమాత్రం తగ్గినా సహించని తత్వం నిఖిల్ కి ఉందని అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో దర్శకనిర్మాతలతో అతడు ఘర్షణ పడతాడు. అయితే తానేం చేసినా తన సినిమా అత్యుత్తమంగా ప్రజల్ని అలరించాలనేదే నిఖిల్ తపన.
క్వాలిటీ కథల్ని ఎంచుకుంటూ అంతే నాణ్యమైన కంటెంట్ ని అందించాలని తపించే నిఖిల్ కి ఆల్ ది బెస్ట్. స్పై తెలుగు ప్రేక్షకులతో పాటు అటు ఉత్తరాదినా బాగా ఆడుతుందని ఆకాంక్షిద్దాం.