Begin typing your search above and press return to search.

ఆటల బయోపిక్ లతో ఇరగదీస్తున్నారు

By:  Tupaki Desk   |   4 March 2016 5:30 PM GMT
ఆటల బయోపిక్ లతో ఇరగదీస్తున్నారు
X
బాలీవుడ్ లో లేటెస్ట్ హిట్ సీక్రెట్ ఏంటంటే బయోపిక్స్. రియల్ లైఫ్ స్టోరీలను ఆసక్తికరంగా తెరకెక్కించి, వాటితో సూపర్ హిట్స్ కొట్టేస్తున్నారు. ఆయా కేరక్టర్లు అప్పటికే రియల్ హీరోలు కావడంతో కావాల్సినంత ఎమోషన్ కూడా పండుతుంది. అయితే బయోపిక్స్ లో స్పోర్ట్స్ బయోపిక్స్ లెక్క వేరయా అని చెప్పాలి. ఆటల కాన్సెప్ట్ తో వచ్చిన ఏ ఒక్క బయోపిక్ కూడా ఇప్పటివరకూ నిరుత్సాహ పరచలేదు.

'చక్ దే ఇండియా'లో మహిళా హాకీ టీం కోచ్ రంజన్ నేగి పాత్రతో షారుక్ ఖాన్ ఈ ట్రెండ్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నుంచి డెకాయిట్ గా మారిన వ్యక్తి స్టోరీ అయిన 'పాన్ సింగ్ తోమర్' కూడా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా నటించిన 'మేరీ కోమ్' - ఫరాన్ అక్తర్ చేసిన 'భాగ్ మిల్కా భాగ్' లు మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ చేస్తున్న 'డంగల్' కూడా రియల్ లైఫ్ స్పోర్ట్స్ స్టోరీనే. కూతుళ్లకు రెజ్లింగ్ నేర్పించి, మెడల్స్ గెలిచేలా చేసిన మహావీర్ సింగ్ ఫొగట్ స్టోరీ ఇది.

ఇదే కాకుండా ఇప్పుడు సెట్స్ పై కూడా అనేక బయోపిక్స్ ఉన్నాయి. క్రికెటర్ ధోనీ కథతో 'ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' - పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మురళీకాంత్ పేట్కర్ - హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ - క్రికెటర్ అజారుద్దీన్ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి.