Begin typing your search above and press return to search.

ఖుషి జోడి.. మరో మ్యాజికల్ మూమెంట్

By:  Tupaki Desk   |   9 July 2023 3:42 AM IST
ఖుషి జోడి.. మరో మ్యాజికల్ మూమెంట్
X
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమా అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ కు ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాట ను చూస్తే.. విజయ్, సమంత మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సినిమా లో బాగా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వాహబ్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్‌.. అందరిని మరింత ఆకట్టుకుంటోంది. 'ఆరాధ్య' అనే పాటను రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఇందులో సమంత- విజయ్‌ ఎంతో కూల్‌ గా ఒకరి చేతిని మరొకరు పట్టుకు ని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ పాట ప్రోమో ను సోమవారం(జులై 9), పూర్తి పాటను బుధవారం(జులై 11) విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

ఇకపోతే ఇప్పటికే 'నా రోజా నువ్వే' సాంగ్ లో యూట్యూబ్‌ లో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. వంద మిలియన్ల వ్యూస్ కు చేరువ లో ఉంది. దీంతో ఈ సెకండ్ సింగిల్‌ ఎలా ఉండబోతుందా అని అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సాంగ్ తో 'ఖుషి' సినిమా మరోసారి ట్రెండ్ అవ్వడం ఖాయమని అంటున్నారు అభిమానులు.

ఇకపోతే ఈచిత్ర దర్శకుడు శివ నిర్వాణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీని తెరకెక్కించడం లో అతడి మార్క్ ఎలా ఉంటుందో సినీ ప్రియుల కు తెలిసిన విషయమే. ఈ ఖుషి చిత్రంతో అతడు మార్క్ ను మరోసారి చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా ను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.