Begin typing your search above and press return to search.

పోలీస్ కేసులంటున్న పూజా మేనేజర్?

By:  Tupaki Desk   |   9 May 2019 12:54 PM IST
పోలీస్ కేసులంటున్న పూజా మేనేజర్?
X
ఇప్పుడున్న 4జి ప్రపంచంలో నిజాలకు రూమర్లలు మధ్య చాలా సన్నని గీత ఉంటోంది. అందుకే ఒకప్పుడు వీటి పట్ల తీవ్రంగా స్పందించే సెలెబ్రిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్ సైట్స్ యు ట్యూబ్ ఛానెళ్ల పోకడ చూసి ఇదంతా మాములే అని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు . వీటిని కట్టడి చేసే అవకాశం తక్కువగా ఉండటంతో ఎవరైనా ఏమి చేయలేని నిస్ససహయత. అయితే హీరొయిన్ పూజా హెగ్డే మేనేజర్ మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకుంటాను అంటున్నారట.

ఇటీవలే జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పూజ హెగ్డే ప్రయాణిస్తున్న కారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిందని మేనేజరే ఆ సమయంలో వాహనం నడుపుతున్నాడని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్పగించి అతను వేరే కారులో పూజా మరో వెహికల్ లో వెళ్లిందని మీడియా వర్గాల్లో బాగానే ప్రచారం జరిగింది. ఇది పుకారో నిజమో నిర్ధారణ కాకుండానే వైరల్ అయ్యింది

ఇప్పుడు ఇది ప్రచురించిన సదరు సైట్స్ ఛానల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలనేది పూజా మేనేజర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇది కూడా అధికారికంగా తెలిసింది కాదు.మహేష్ తో పూజా హెగ్డే మొదటిసారి నటించిన మహర్షి ఇవాళ విడుదలైన నేపధ్యంలో ఇలాంటి టాక్ రావడం గమనార్హం