Begin typing your search above and press return to search.

నిఖిల్ కాస్త రొమాంటిక్ గా మారాలి!

By:  Tupaki Desk   |   23 Jun 2023 7:00 PM GMT
నిఖిల్ కాస్త రొమాంటిక్ గా మారాలి!
X
యంగ్ హీరో నిఖిల్ క్రేజ్ కి తిరుగులేదు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. కంటెంట్ బేస్ట్ చిత్రాల‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద మోత మోగించే స్తున్నాడు. 'కార్తికేయ‌-2' అతనికి పాన్ ఇండియా లోనే అనూహ్య‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. రొటీనికి భిన్నంగా సినిమాలు చేయ‌డమే యంగ్ హీరో కి క‌లిసొచ్చింది.

న‌లుగురు దారికి భిన్నంగా వెళ్ల‌డ‌మే అత‌న్ని స‌క్సెస్ ట్రాక్ కి ప్ర‌ధాన కార‌ణంగా. కార్తికేయ ద‌గ్గ‌ర నుంచి స్టోరీల ప‌రంగా నిఖిల్ సెల‌క్ష‌న్ ఇన్నోవేటివ్ గా ఉంటుంది. కొన్ని సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ గా భారీ విజ‌యాలు సాధించ‌క పోవ‌చ్చు కానీ కంటెంట్ ప‌రంగా అవి ఫెయిల్యూర్ చిత్రాలు కాదు.

అక్క‌డ నుంచి చేసిన ప్ర‌తీ సినిమా ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతి ని పంచిన‌వే. 'సూర్య వ‌ర్సెస్ సూర్య‌'.. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'.. 'కేశ‌వ‌'..'అర్జున్ సూర‌వ‌రం'..'18 పేజీస్' అన్ని వేటిక‌వి ప్ర‌త్యేక‌త‌ని చాటిన చిత్రాలే. ఇలా స్టోరీల ఎంపిక ప‌రంగా నిఖిల్ కి తిరుగులేదు. అయితే ఇక్క‌డ రొమాంటిక్ నిఖిల్ ని మాత్రం అభిమానులు మిస్ అవుతున్నారు. అవును ఇది నిఖిల్ ఒప్పుకోవాల్సిన నిజం. అత‌ని చిత్రాల్లో రొమాన్స్ కి ఏ మాత్రం ప్రాధాన్య‌త ఉండ‌టం లేద‌ని ఓ విమ‌ర్శ తెర‌ పైకి వ‌స్తోంది.

స్టోరీ ప‌రంగా స‌న్నివేశాలు డిమాండ్ చేయ‌క రొమాన్స్ కి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదా? లేక రొమాంటిక్ పేరు తో బూతు అనే విమ‌ర్శ రాకూడ‌ద‌ని బోల్డ్ స‌న్నివేశాల‌కు దూరంగా ఉన్నాడా? అన్న‌ది తెలియ‌దు కానీ..ఈ విషయం లో మాత్రం అభిమానులు కాస్ల హ‌ర్టింగ్ గానే క‌నిపిస్తున్నారు. స్టార్ హీరోలంతా ఎలాంటి సినిమాలు చేసిన హీరోయిన్ త‌ప్ప‌కుండా రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. వీటికి ఎవ‌రో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌! హీరోలంతా రొమాంటిక్ స‌న్నివేశాల విష‌యం లో త‌గ్గేదేం లేదు.

కానీ ఆ ఛాయిస్ మాత్రం నిఖిల్ తీసుకోవ‌డం లేదు. స్టోరీ...అందు లో పాత్ర‌ల‌ తోనే సినిమా ని హైలైట్ చేస్తున్నారు త‌ప్ప‌! అప్పుడప్పుడైనా వాటి జోలికి వెళ్ల‌డం లేదు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌కు నిఖిల్ ఎలాంటి బ‌ధులిస్తాడో చూడాలి. ప్ర‌స్తుతం స్పై అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగే స్టోరీనే. మ‌రి ఈ సినిమా కోసం అలాంటి ఛాయిస్ ఏదైనా తీసుకున్నాడా? అన్న‌ది చూడాలి. ప్ర‌చార చిత్రాల వ‌ర‌కూ ఎక్క‌డా ఆ స్కోప్ తీసుకున్న‌ట్లు అయితే క‌నిపించ‌లేదు.