Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై నిఖిల్ ఫోకస్
By: Tupaki Desk | 18 Feb 2023 2:00 PM GMTప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా... కంటెంట్ బాగుంటే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మొదలైన ఈ పద్దతి... మొన్న చిన్న సినిమా కార్తికేయ 2 కూడా అన్ని భాషల్లో విడుదల అయి.. హిట్ కొట్టింది. ఇక నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నార్త్ వాళ్ళకి బాగా నచ్చేసింది. నిఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పై కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కొన్ని వారాల క్రితం నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన తన లుక్, మూవీ అప్డేట్ ఇచ్చారు.
ఈ చిత్రం టైటిల్‌కు అనుగుణంగా... నిఖిల్ NSG కమాండో అవతార్‌లో కనిపిస్తాడనీ తెలుస్తోంది.. అతను చేతిలో గ్లాక్-17 పిస్టల్‌ని కూడా పట్టుకుని ఉన్నాడు.”అఫీషియల్ లీక్ అంటూ... భారీ, మల్టీ లాంగ్వేజ్, నేషనల్ థ్రిల్లర్ SPY ఈ సమ్మర్ కు దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.” అని నిఖిల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చడు. చిత్ర షూటింగ్ నుండి తన ఆన్‌లోకేషన్ ఫొటోను జత చేశాడు.
ఇదిలా ఉంటే, నిఖిల్ తదుపరి చిత్రం కూడా పాన్-ఇండియా చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రేపు వెలువడుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. గత సంవత్సరం కార్తికేయ 2 రూపంలో నిఖిల్ భారీ విజయాన్ని సాధించాడు. తెలుగుతో పాటు, ఈ చిత్రం నార్త్ బెల్ట్‌లో కూడా సమానంగా మంచి వసూళ్లను సాధించి అతనికి పాన్-ఇండియా గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుండి నిఖిల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాడు.
మేలో తెరపైకి వచ్చే అవకాశం ఉన్న SPYపై నిఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూలియన్ అమరు ఎస్ట్రాడా అనే హాలీవుడ్ టెక్నీషియన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.