Begin typing your search above and press return to search.

పులి పిల్ల ప్రమోట్ చేయదంట

By:  Tupaki Desk   |   23 April 2018 4:21 AM GMT
పులి పిల్ల ప్రమోట్ చేయదంట
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పులి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నికిషా పటేల్. పులి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫట్ మనడంతో నికిషాకు తెలుగులో అవకాశాలు రాకుండా పోయాయి. దాంతో శాండల్ వుడ్ షిఫ్టయిపోయి కన్నడలో సినిమాలు చేసుకుంటూ వస్తోంది. తెలుగులో అరకు రోడ్ ల్ అంటూ పూరి తమ్ముడు సాయిరాం శంకర్ తో సినిమా చేసినా నికిషా ఖాతాలో ఓ సినిమా సంఖ్య పెరిగింది తప్ప ఆమెకు క్రేజ్ మాత్రం రాలేదు.

తాజాగా నికిషా రౌడీ పోలీస్ అని ఓ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ చేస్తోంది. పులి సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించిన ఈ భామ మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీలో పోలీస్ గా కనిపించనుంది. ఈమెతోపాటు మరో ఉత్తరాది భామ గుర్లిన్ చోప్రా కూడా పోలీస్ రోల్ చేస్తోంది. పవన్ హీరోయిన్ గా ఇప్పటికీ కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న నికిషా ఈ మూవీ గురించి ఎక్కడా ప్రమోట్ చేయడం లేదు. అడిగితే ఎందుకు చేయాలని ప్రశ్నిస్తోంది. ఇందుకు కారణం రౌడీ పోలీస్ ఆమెది కామియో రోల్ మాత్రమేనట. ఇలా కనిపించి అలా వెళ్లిపోయే భాగ్యానికి తన పేరు వాడటం ఎందుకనేది ఈ భామ ప్రశ్న.

తెలుగులో హిట్ అన్నది నికిషాకు అందని ద్రాక్షే అయినా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తేరి మెహర్బానియా అనే హిందీ మూవీతోపాటు గుంటూర్ టాకీస్ సీక్వెల్ లో నికిషా హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతున్న నికిషా ఆశ ఎప్పటికి తీరుతుందో.. ఏమో?