Begin typing your search above and press return to search.

కారులో నిహారిక ఏంటా ఫోజులు..?

By:  Tupaki Desk   |   26 Jun 2023 10:14 PM GMT
కారులో నిహారిక ఏంటా ఫోజులు..?
X
నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఏకైక అమ్మాయి తను. మూడు, నాలుగు సినిమాలు చేసి అవి క్లిక్ కాకపోవడంతో వదిలేసింది. అయితే, మళ్లీ ఇప్పుడు నటినా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాని లో భాగంగానే వెబ్ సిరీస్ లు, మూవీల్లో నటించడం మళ్లీ షురూ చేసింది.

ఇక, నిహారిక సోషల్ మీడియా లోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె లుక్ బాగుంది.డ్రెస్ కూడా చాలా ట్రెండీగా ఉంది. కానీ, ఆ ఫోటో ఫోజులే కొంచెం భిన్నంగా ఉన్నాయి. అది కూడా కారులో, క్లీవేజ్ షో చేసేలా ఫోటోలు దిగడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా, నిహారిక బాగా మారిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ ఫోటోల్లో ఆమె చాలా బోల్డ్ గా కనపడుతోంది. ఈ మధ్య నిహారిక తనను తాను బోల్డ్ గా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది.అందుకే ఎప్పుడూ లేని విధంగా బికినీ, క్లీవేజ్ ఫోటోల ను కూడా షేర్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితు లతో కలిసి ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేయడం విశేషం.

ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. అందులోనూ బోల్డ్ డైలాగులు వాడి షాకిచ్చింది. వెబ్ సిరీస్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ నిహారిక బోల్డ్ గా మారిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే, ఈ కాలం జనరేషన్ అలాంటి పదాలు చాలా కాజువల్ గానే తీసుకుంటున్నారు కానీ, నిహారిక నుంచి అలాంటివి రావడమే చాలా మందిని షాక్ కి గురి చేసింది.

ఇదిలా ఉండగా, నిహారిక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టినట్లు కనపడుతోంది. ఇటీవల ఓ మూవీకి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. మరి ఆ సినిమా లో ఎవరు నటిస్తున్నారు, ఎలాంటి కథ అనే విషయాలు మాత్రం బయట కు రాలేదు. త్వరలోనే ఆ వివరాల ను షేర్ చేసే అవకాశం ఉంది.