Begin typing your search above and press return to search.

పీసీతో భ‌ర్త‌ నిక్ కి అభిప్రాయ భేధాలు..?

By:  Tupaki Desk   |   22 March 2021 5:30 PM GMT
పీసీతో భ‌ర్త‌ నిక్ కి అభిప్రాయ భేధాలు..?
X
అమెరిక‌న్ గాయ‌కుడు కం న‌టుడు నిక్ ఇటీవల తన కొత్త ఆల్బమ్ స్పేస్ మ్యాన్ ను తన భార్య ప్రియాంకకు అంకితం చేసిన సంగ‌తి తెలిసిందే. అది భార్య‌కు ఒక ప్రేమలేఖ అని పేర్కొన్నాడు. వృత్తిరీత్యా ఒక‌రికొక‌రు దూరంగా ఉండటం మహమ్మారి వ‌ల్ల‌నా.. మ‌రింత దూరంగా ఉండాల్సి రావ‌డంతో.. సుదూర సంబంధం ఎలా ఉందో నిక్ ఆ ఆల్బ‌మ్ లో పాడి వినిపించారు. ముఖ్యంగా ప్రేమ కోసం ఆరాటపడే వాడిగా.. ప్రియమైనవారికి దూరంగా ఉండటంలో విర‌హాన్ని ఆ పాట‌లో క‌న‌బ‌రిచాడు నిక్. ఆ ప్రేమ‌కు పీసీ ఎంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది.

నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రా జంట‌కు 2018లో పెళ్ల‌య్యింది. అప్ప‌టి నుంచి అన్యోన్య జీవ‌నంతో ఆద‌ర్శ జంట‌గా వెలిగిపోతున్నారు. మ‌హ‌మ్మారీ కాలంలోనే దూరంగా గ‌డిపారు. ఇక‌పోతే ఈ అరుదైన ప్రేమ‌జంట‌కు అభిమానులు ఒక అరుదైన కానుక‌ను ఇవ్వ‌ద‌లిచారు. ఒక షిప్ కి ఈ జంట పేరును ఎంపిక చేయాల‌నుకుంటున్నారు. వీరి కోసం సృజనాత్మకంగా ఓడ పేర్లను నెటిజ‌నులు వెతికారు. ఇటీవల గ్రాహం నార్టన్ షో కోసం తన ప్రదర్శనలో నిక్ తనకు నచ్చిన ఓడ పేరును వెల్లడించాడు.

తన కొత్త ఆల్బమ్ స్పేస్ మ్యాన్ ను ప్రోత్సహించడానికి నిక్ గ్రాహం నార్టన్ టాక్ షోలో కనిపించాడు. ప్రియాంక ఎంపిక చేసిన ప్రిక్ (ప్రియాంక + నిక్) కంటే నిక్యాంకను బాగా ఇష్టపడుతున్నానని నిక్ చెప్ప‌డం విశేషం. జిమ్మీ ఫాలన్ షోలో తనకు ప్రిక్ అనే ఓడ పేరు నచ్చిందని అంత‌కుముందు పీసీ వెల్లడించారు. ఈ విష‌యంలో నిక్ అభిప్రాయం వేరుగా ఉంది. ఏదేమైనా ప్రేమ‌లో ఆ ఇద్ద‌రూ ఒక్క‌టే. ఆ జంట జీవ‌నం ఎప్పుడూ ఆద‌ర్శ‌మే. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే విభేధాలు త‌ప్ప‌దు.

స్పేస్‌మ్యాన్ మార్చి 12 న విడుదలైంది. ఇప్పటివరకు రెండు మ్యూజిక్ వీడియోలు విడుదలయ్యాయి. ఆల్బమ్ టైటిల్ ట్రాక్ వీడియో ప్రియాంక చోప్రా అతిథిగా ఆవిష్క‌రించగా అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది.