Begin typing your search above and press return to search.

ఫిలింక్రిటిక్స్ లో న్యూస్ కాస్ట‌ర్స్ విలీనం ర‌ద్దు

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:30 AM GMT
ఫిలింక్రిటిక్స్ లో న్యూస్ కాస్ట‌ర్స్ విలీనం ర‌ద్దు
X
గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ (FCA) లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) విలీన ప్రతిపాదనను ఫిలిం క్రిటిక్స్ కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీంగా తోసిపుచ్చిన కారణంగా ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం వెలువ‌డింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు సంబంధించినంత వరకు ఆ ప్రతిపాదన పూర్తిగా రద్దు అయినట్లేన‌ని ఎఫ్.సి.ఏ తాజా ప్ర‌క‌ట‌న‌లో అధికారికంగా పేర్కొంది. ఆ మేర‌కు నేటి(18సెప్టెంబ‌ర్) కార్య‌వ‌ర్గ స‌మావేశంలో తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. అంటే ఇక ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌తినిధులు.. వెబ్ మీడియా ప్ర‌తినిధుల‌ను ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ లో క‌ల‌వ‌డం లేన‌ట్టేన‌ని ఖ‌రారైంది. దీనివ‌ల్ల ఎవ‌రికి వారు కార్య‌క‌లాపాల‌ను ఇండివిడ్యువ‌ల్ గా కొన‌సాగించాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఇక ఫిలింక్రిటిక్స్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఇదివ‌ర‌కూ జ‌రిగిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు రూల్స్ ప్రకారం 25000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ప్రకటించిన విధంగా లక్ష రూపాయలు ఇవ్వటం సాధ్యపడదని కార్యవర్గం తీర్మానించింది. చనిపోయిన సభ్యుని కుటుంబానికి 25000 రూపాయల తక్షణ సహాయం అందించే విధానం మాత్రం అలాగే కొనసాగుతుందనే తీర్మానించాం.

అసోసియేషన్ లో ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలోనూ ఇతరత్రా లూజ్ అకౌంట్స్ రూపంలోనూ మూలధనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్- టర్మ్ పాలసీలకు ఆ మూల ధనాన్ని వినియోగించ‌కూడ‌దని గతంలోనే తీర్మానం జరిగినందున నవంబర్ 1 వరకు ఫండ్ రైజింగ్ కొరకు ప్రయత్నించాల‌ని తీర్మానించారు. అది సాధ్యపడని యెడల ఎఫ్ డి ల మీద లోన్ తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.

ప్రస్తుత సభ్యుల రెన్యూవల్ 200 ఉండగా దానిని ఇకపై 500 లుగా నిర్ణయించటమైనది. పాత స‌భ్యుల్లో రెన్యువల్స్ చేయనివారు యథాప్రకారం బకాయి సంవత్సరానికి 200 చొప్పున చెల్లించవలెను. సభ్యత్వ బకాయిలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవటానికి అక్టోబర్ 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ(పాత) రెన్యువల్స్ చేయవలసిన వారు ట్రెజరర్ ని సంప్ర‌దించాలి. అలా రెన్యువల్ చేసుకోని వారికి అసోసియేషన్ నుండి ఎటువంటి లబ్ది ఉండదు. వాట్స్ అప్ గ్రూప్ నుండి తొలగించబడును. డ్యూయ‌ల్ మెంబ‌ర్ షిప్ లేనందున ఇప్పుడు ఏదో ఒక అసోసియేష‌న్ లో మాత్ర‌మే స‌భ్య‌త్వానికి అవ‌కాశం ఉంది. ఒక సంఘం నుంచి వైదొల‌గాల్సి ఉంటుంద‌ని ఎఫ్ సీఏ తీర్మానించింది.

1968లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సమయంలో ఏర్పరుచు కున్న బైలాస్ ను సవరించుకోవలసిన అవసరం ఉన్నందున ఆ పరంగా త్వరలోనే అప్డేటెడ్ బైలాస్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్సూరెన్స్ చేసే లోపు సభ్యులు ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఎంత ఖర్చయినదో దానిని కమిటీ పరిశీలించి లక్షకు పైగా ఖర్చు అయితే అందులో 25000 ఇవ్వాలని తీర్మానించారు. ఈ మేరకు సభ్యుడు మామిడిపల్లి గిరిధర్ తీవ్ర అనారోగ్యం పాలై ఆపరేషన్ జరిగిన కారణంగా కమిటీనీ అభ్యర్దించిన మేర బిల్లులను ఈసీలో పరిశీలించి 25000 ఇవ్వాలని నిర్ణయించారు.

ఈసీ మీటింగ్ ల నిర్వహణ విషయంలో ప్రతిసారీ ఏర్పడే అయోమయానికి తెరదించుతూ ఇకమీదట ప్రతినెలా రెండవ శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ.సీ. మీటింగ్స్ నిర్వహించాలని తీర్మానించాం. మూడు కమిటీ సమావేశాలకు హాజరుకాని సభ్యులను కమిటీ నుండి తొలగించడం జరుగుతుంది అనే పాత నిబంధనను ఇక మీదట గట్టిగా అమలు చేయాలని తీర్మానించారు. ఈ స‌మావేశంలో చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న ఇరు సంఘాల‌ విలీన ర‌ద్దు నిర్ణ‌యం ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది. ఎఫ్ సిఏకి ప్ర‌భు అధ్య‌క్షులుగా పి.రాంబాబు ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.