Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత మళ్లీ ప‌త్తా లేడే!

By:  Tupaki Desk   |   28 Feb 2023 8:00 AM GMT
ఆ నిర్మాత మళ్లీ ప‌త్తా లేడే!
X
ఆమ‌ధ్య ఓటాలీవుడ్ బ‌డా నిర్మాత కుమారుడు భారీ అంచ‌నాల మ‌ధ్య ఓ సినిమా నిర్మించి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. తొలి సినిమా కావ‌డంతో బ‌డ్జెట్ ప‌రంగా ఏమాత్రం రాజీ ప‌డ‌కుండానే ప‌నిచేసాడు. డ‌బ్బు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసాడు. అంత‌కు ముందు హీరో మేకోవ‌ర్ కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసాడు. ప్ర‌త్యేకంగా విదేశాలు పంపించి అక్క‌డి ట్రైన‌ర్ల స‌మ‌క్షంలో శిక్ష‌ణ ఇచ్చి రాటు పాత్ర‌కి రాటు దేలేలా త‌యారు చేసాడు.

కానీ ఈ శ్ర‌మంతా ఆ నిర్మాత‌కు బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయింది. ఎన్నో అంచ‌నా మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా తీవ్ర న‌ష్టాల్ని మిగిల్చింది. అయితే ఆ నాటి నుంచి స‌ద‌రు నిర్మాత మ‌ళ్లీ ఎక్క‌డా మీడియాలో క‌నిపించ‌లేదు. ఆయ‌న ఫోటోలుగానీ.. వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎక్క‌డా వైర‌ల్ కాలేదు. అస‌లు ఏ మీడియా కెమెరా కంట ప‌డ‌లేదు. దీంతో ఇప్పుడు ఆయ‌న ఏమైనట్లు అని సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇండ‌స్ర్టీలో ఉన్న‌ట్లా? లేక మ‌ళ్లీ తిరిగి పాత వ్యాపారాల్లోకి వెళ్లిపోయిన‌ట్లా? అంటూ సందేహిస్తున్నారు. నిజానికి నిర్మాణ రంగం వైపు రావ‌డం అన్న‌ది యాదృశ్చికంగా జ‌రిగిందే. తండ్రి పెద్ద నిర్మాత అయినా ఆ కుమారుడు ముందుగా ఇటువైపు రాలేదు. ఇత‌ర వ్యాపారాల్లో బిజీ అయ్యారు. రంగుల ప్ర‌పంచానికి అత‌ను చిన్న నాటి నుంచి దూరంగానే ఉన్నాడు. పెద్దాయ్యాక అదే కొన‌సాగించాడు.

అయితే అనూహ్యంగా నిర్మాణ రంగంలోకి ట‌ర్న్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడేమ‌య్యారు? అన్న‌ది అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక‌వేళ ఉంటే గ‌నుక ఇలా ప‌రిశ్ర‌మ‌లో ఇన్ యాక్టివ్ గా ఉంటే లాభం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌కి ట‌చ్ లో ఉండాలి. కొత్త అప్ డేట్స్ ఇవ్వాలి. ఆర్ధిక ఇబ్బందులు లేని నిర్మాత కాబ‌ట్టి కొత్త ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించాలి. ఇండ‌స్ర్టీ తాజా ప‌రిస్థితుల‌పై విశ్లేషించ‌గ‌ల‌గాలి. ఈ విష‌యంలో అశ్ర‌ద్ద చేస్తే ఇండ‌స్ర్టీ అత‌న్ని మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంది. ప‌రిశ్ర‌మ ఎంత తొంద‌ర‌గా ఆక‌ర్షించుకుంటుందో..అంతే తొద‌ర‌గానూ విక‌ర్షిస్తుంది. ఇండ‌స్ర్టీలో కొన‌సాగాలంటే? ఈ లాజిక్ యాది పెట్టుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.