Begin typing your search above and press return to search.
ఆర్జీవి నిజం.. అసలు నిజం ఇదేనా..?
By: Tupaki Desk | 28 April 2023 8:34 PM GMTవిషయం ఏదైనా సరే అక్కడ ఆర్జీవి ఉన్నాడు అంటే అసలు మ్యాటర్ వదిలి కొత్త మ్యాటర్ వార్తల్లోకి వస్తుంది. ఒక విషయాన్ని ప్రపంచం అంతా ఒకలా తను మరోలా ఆలోచిస్తాను అనుకుంటాడు ఆర్జీవి ఒకప్పుడు అతని మాటలను నమ్మిన ప్రేక్షకులు తర్వాత మోసపోయాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సినిమా దర్శకుడిగా పాపులర్ అయ్యి తన మేధస్సుతో ప్రపంచాన్ని మొత్తం కడిగిపారేస్తా అంటూ చెలరేగిపోతుంటాడు వర్మ. ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు.. లేదా నేను వాడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్ అని చెప్పినట్టుగా ఆర్జీవితో ఏదైనా డిబెట్ పెడితే ఇవతల వారు తగ్గాలే తప్ప ఆయన నెగ్గానని సంతృప్తి చెందేవరకు డిబేట్ కొనసాగిస్తూనే ఉంటాడు.
ఆర్జీవి అంత మేధావి మరొకరు లేరని కొందరు.. అసలు ఆర్జీవి పరమ వేస్ట్ అనే వారు కొందరు. ఇలా ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం నేనన్నది నిజం అంటూ తన పంథా తను కొనసాగిస్తున్నాడు ఆర్జీవి. ఇదిలా ఉంటే సడెన్ గా నిజం అంటూ ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్ ని మొదలు పెట్టాడు ఆర్జీవి. ఆర్జీవి వెళ్తే ఏదో ఒక ఛానెల్ స్లాట్ ఇచ్చి ఏదో ఒక విషయం మీద డిబేట్ పెట్టేస్తారు. అయితే అది ఒకప్పుడు ఆర్జీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అలా చేశారు. ఒకానొక టైం లో ఆర్జీవి స్టూడియోలో ఉంటే ఛానల్ రేటింగ్ అమాంతం పెరిగేది.
కానీ ఇప్పుడు ఆర్జీవి తన స్టాండర్డ్ సినిమాలు చేయట్లేదు సరికదా అమ్మాయిల కాళ్లు వేళ్లను ముద్దులాడుతూ కనిపిస్తున్నాడు. ఆర్జీవి ఒక గొప్ప మేధా శక్తి ఉన్న వాడే కావొచ్చు కానీ ఏది దాచుకోకపోవడం బుద్ధిమంతులకు తెలియదా అని అనుకోవచ్చు. ఇంతకీ ఆర్జీవి నిజం ఎందుకు పెట్టాడు అంటే తనను ఎవరు స్టూడియోలకు పిలవట్లేదని పెట్టినట్టు ఉన్నాడని ఆడియన్స్ రియాక్షన్. నిజం అసలైన నిజం అంటూ ఆర్జీవి ఏదో కొత్తగా చెప్పాలని చూస్తున్నాడు.
సినిమాల మీద తన క్రియేటివిటీని పక్కన పెట్టి తన తెలివితేటలతో ఆడియన్స్ ని తనను టార్గెట్ చేసిన వారిని బకరాలను చేయడం ఆర్జీవికి అలవాటే. ఇంతకీ ఆర్జీవి నిజం ఛానెల్ ఎందుకు పెట్టాడు.. ఆ నిజం వెనుక అసలు నిజం ఏంటి అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.