Begin typing your search above and press return to search.
రైటర్ కోన వివాదంలో కొత్త ట్విస్టు
By: Tupaki Desk | 30 Sep 2019 6:30 AM GMTటాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. సినిమా కథ ఇస్తానని 2017లో 13.50 లక్షలు తీసుకుని కథ ఇవ్వకుండా తాత్సారం చేసారని.. తిరిగి అడ్వాన్సు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా తనని బెదిరించాడని జెమినీ ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారని వార్తలొచ్చాయి. ఆ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోన వెంకట్ పై 406.. 420 కేసులను నమోదు చేసారని ప్రచారమైంది.
అయితే ఈ వివాదం తమ మధ్య సమస్య సమసిపోయిందని జెమిని ఎఫ్.ఎక్స్ ఇన్ ఛార్జ్ (జూబ్లీహిల్స్ ఆఫీస్) ఆర్.వి.ప్రసాద్ ఓ లేఖ రాశారు. ఆయన ఆ లేఖలో వివాదంపై వివరణ ఇచ్చారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల తప్పు జరిగింది. ఎలక్ట్రానిక్.. ప్రింట్ మీడియాలలో ప్రచారం అయిన ఆ వార్త సరికాదు. సరైన వివరాలు లేకుండా తప్పుడు ప్రచారం జరిగింది. ఈ వార్తను ప్రచారం చేసింది ఎవరో వారికి చెబుతున్నా. ఈ సమస్య మా ఇద్దరి మధ్యలో సెటిలైపోయింది. ఎలాంటి అపార్థాలు మా మధ్య లేవు.. అని తెలిపారు.
మొత్తానికి ఆ ఇద్దరూ సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారని అర్థమవుతోంది. కోన ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్ధం అనే బహుభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి రచయిత.