Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' కొత్త వివాదం.. కేసు నమోదు
By: Tupaki Desk | 5 April 2023 4:25 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిందీ చిత్రం ఆదిపురుష్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. గత ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్న ఆదిపురుష్ సినిమాను గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. తాజాగా సినిమా కొత్త పోస్టర్ ను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ రకరకాలుగా చిత్ర యూనిట్ సభ్యులకు ఇబ్బందులు కలుగజేస్తుంది.
ఆదిపురుష్ శ్రీరామ నవమి పోస్టర్ లో సీత దేవి మరియు రాముడి వేషధారణ ఇంకా వారి యొక్క బాడీ లాంగ్వేజ్ హిందువుల మనోభావాలను కించ పరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు ఆరోపిస్తున్నారు. రాముడిని ఇప్పటివరకు చూసిన విధంగా కాకుండా విభిన్నంగా చూపించడంతో పాటు జంజపు తాడు లేదని.. ఇలాంటి దుస్తులు వేసుకున్నట్లుగా చూపించడం వల్ల రాముడిని అవమానించినట్లే అంటూ ముంబయికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాముడిని తప్పుగా చూపించడంతో పాటు రామాయణం ను తప్పుగా చూపించే ప్రయత్నం ఆదిపురుష్ ద్వారా జరుగుతుంది అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఆదిపురుష్ కు ఉన్న సమస్యలు తప్పవు అన్నట్లుగా ఇది ఒక సమస్య అవ్వడంతో విడుదల సమయంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ విడుదల అయిన తర్వాత సినిమా చిన్న పిల్లల మూవీ అన్నట్లుగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ విషయంలో కాస్త వర్కౌట్ చేసి గ్రాఫిక్స్ వర్క్ ను మళ్లీ చేయడం జరిగింది. ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.