Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన నేపాల్ కోర్టు
By: Tupaki Desk | 24 Jun 2023 5:00 PM GMTబాలీవుడ్ సినిమాలు దాదాపు అన్నీ కూడా నేపాల్ దేశంలో విడుదల అవుతూ ఉంటాయి. హిందీ సినిమాలు నేపాల్ లో భారీ ఎత్తున వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా కారణంగా హిందీ సినిమాలను నేపాల్ దేశంలో బ్యాన్ చేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేపాల్ కోర్టు తాజాగా బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆదిపురుష్ సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయని.. అంతే కాకుండా సీతాదేవి జన్మ స్థలం ఇండియా అన్నట్లుగా ఆదిపురుష్ లో చూపించారు. సీతాదేవి నేపాల్ లో జన్మించిందని అక్కడి వారు బలంగా నమ్ముతారు. అందుకే అక్కడ సీతమ్మ కు ప్రత్యేక గుడులు ఏర్పాటు చేసి మరీ పూజిస్తూ ఉంటారు.
అలాంటి సీతమ్మ ను ఆదిపురుష్ సినిమాలో తక్కువ చేసి చూపించారు అంటూ నేపాల్ ప్రభుత్వం ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయడంతో పాటు మొత్తం హిందీ సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించారు.
కోర్టుకు వెళ్లిన డిస్ట్రిబ్యూటర్స్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమాలను అడ్డుకునే అర్హత ఎవరికీ లేదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వం హిందీ సినిమాల విడుదలకు నో చెప్పింది.
చివరకు నేపాల్ మోషన్ పిక్చర్స్ అసోషియేషన్ మరియు స్థానిక ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో హిందీ సినిమాలు నేపాల్ లో విడుదలకు లైన్ క్లీయర్ అయ్యింది.
అయితే ఆదిపురుష్ సినిమాను మాత్రం నేపాల్ లో విడుదల చేసేది లేదు అన్నట్లుగా స్థానిక ప్రభుత్వం క్లీయర్ గా ప్రకటించింది. ఇక పై బాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇంతకు ముందు మాదిరిగా నేపాల్ లో విడుదల అవ్వబోతున్నాయి.