Begin typing your search above and press return to search.
కిడ్నాప్ ను మెచ్చిన సెన్సార్
By: Tupaki Desk | 29 Sep 2017 4:21 AM GMTస్టార్స్ లేకున్నా కొన్ని సినిమాలు మంచి కథాంశంతో తెరకెక్కి అందరిని ఆకట్టుకుంటాయి. అయితే కామెడీ తరహా కథలను తెరకెక్కిస్తే ఎక్కువగా విజయాలు దక్కవు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ఎంతో మంది కమెడియన్స్ ఏక స్క్రిన్ మీద కనిపించినా లాభం ఉండదు. కానీ మేము తెరకెక్కించిన సినిమా చాలా బావుందని అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు ఓ చిన్న సినిమా యూనిట్ సభ్యులు.
బ్రహ్మానందం - పోసాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ''నేను కిడ్నాప్ అయ్యాను'. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండబోతోందట. మాధవి అద్దంకి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటి వరకు శరవేగంగా చిత్రీకరణని జరుపుకున్న ఇటీవల డబ్బింగ్ పనుల్ని కూడా పూర్తి చేసుకుంది. అక్టోబర్ 6 న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎక్కువగా కట్ చెప్పకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇచ్చారట. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఫుల్ ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించామని అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉంటాయని చిత్ర నిర్మాత వివరించారు.
ఇక దర్శకుడు శ్రీకర్ కూడా యూ సర్టిఫికెట్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టారు. సినిమా బాగారావడంతో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు సంప్రదిస్తున్నారని బ్రహ్మానందం-పోసాని కాంబో అదిరిపోయిందని చెప్పారు. అలాగే తాగుబోతు రమేష్ - రఘుబాబు మరియు ఇతర నటీనటుల ఎంట్రీ ఇచ్చే ప్రతి సీన్ చాలా నవ్విస్తుందని వివరించారు.