Begin typing your search above and press return to search.

జ్వ‌రానికే ఎందుకీ దుష్ప్ర‌చారం?

By:  Tupaki Desk   |   28 Aug 2019 5:46 AM GMT
జ్వ‌రానికే ఎందుకీ దుష్ప్ర‌చారం?
X
కింగ్ నాగార్జున హార్డ్ వ‌ర్క్ గురించి తెలిసిందే. 60 ఏజ్ లోనూ ఆయ‌న నిరంత‌రం ఫిజిక‌ల్ ఫిట్ నెస్ విష‌యంలో తీసుకుంటున్న శ్ర‌ద్ధ అభిమానుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతోంది. మ‌న్మ‌ధుడు 2 కోసం ఆయ‌న నిరంత‌ర క‌స‌ర‌త్తుల‌తో ఎంతగా శ్ర‌మించారో తెలిసిందే. రెగ్యుల‌ర్ జిమ్ తో అత‌డు చూపించిన మేకోవ‌ర్ ఫ్యాన్స్ కి బిగ్ స‌ర్ ప్రైజ్ ట్రీట్ ని ఇచ్చింది. అంత డెడికేష‌న్ ఉన్న స్టార్ కాబ‌ట్టే వ‌య‌సుతో సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఇంకా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకోగ‌లుగుతున్నారు. ఫిట్ నెస్ గోల్స్ విష‌యంలో యువ హీరోలు సైతం కింగ్ ని ఆద‌ర్శంగా తీసుకుంటున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే ఆయ‌న‌పై ఉన్న‌ట్టుండి సోష‌ల్ మీడియాలో నెగెటివ్ ప్రొప‌గండా సాగ‌డంపై అభిమానులు క‌ల‌త‌కు గురవుతున్నారు. కింగ్ అవ‌స‌రాన్ని మించి అన‌వ‌స‌రంగా వ్యాయామం చేసి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని.. ఈ వ‌య‌సులో ఆయ‌న గాయాల‌య్యేంత‌గా ఎందుకంత క‌స‌ర‌త్తులు? అంటూ ఓ సెక్ష‌న్ సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. అంతేకాదు ఆయ‌న‌కు వెన్ను నొప్పి.. కీళ్ల నొప్పుల‌తో పాటు తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార‌ని కూడా మ‌రో ప్ర‌చారం వేడెక్కించింది. విచ్చ‌లవిడి సోష‌ల్ మీడియా యుగంలో ఏ ప్ర‌చారం సాగినా అందులో నెగెటివిటీ పాళ్లు శ్రుతి మించ‌డంతో అభిమానుల్లో కంగారు క‌నిపిస్తోంది. ఈ విష‌యం కింగ్ కి చేర‌డంతో అత‌డు స్వ‌యంగా బ‌రిలో దిగాల్సొచ్చింది.

త‌న ఆరోగ్యం విష‌య‌మై ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ నెగెటివిటీని త‌గ్గించేందుకు కింగ్ నాగార్జున స్వ‌యంగా .. త‌న ఆరోగ్యం గురించి అభిమానుల‌ను పిలిచి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చిందిట‌. దాంతో నాగార్జున‌పై జ‌రుగుతున్న ఆ ప్ర‌చారానికి చెక్ పెడుతూ.. ఆయ‌న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కేవ‌లం వైర‌ల్ ఫీవ‌ర్ మాత్ర‌మే. ఈ సీజ‌న్ లో అంద‌రికీ అది కామ‌నే క‌దా! అంటూ ఓ సందేశం వాట్సాప్ గ్రూపుల్లోనూ వైర‌ల్ అయ్యింది. అభిమానులు ఏమాత్రం కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నాగార్జున సందేశం ఇచ్చారట‌. త‌న‌పై రూమ‌ర్లు క్రియేట్ చేస్తున్న వాళ్లు ద‌య‌చేసి అలా చేయొద్ద‌ని అభ్య‌ర్థించార‌ని తెలుస్తోంది. ఇక ఈనెల 29న నాగార్జున బ‌ర్త్ డే సంద‌ర్భంగా వార‌సులు నాగ‌చైత‌న్య‌- అఖిల్ చాలా ప్లాన్స్ లో ఉన్నార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉందింకా.