Begin typing your search above and press return to search.
NBK 109: బాబీతో కాదట.. లిస్టులోకి బిగ్ డైరెక్టర్?
By: Tupaki Desk | 21 May 2023 1:00 PM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ నటనకు ఏపీతో పాటు తెలంగాణలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఆయన అభిమానులు. ఆరు పదుల వయసులోనూ కుర్రాడిలా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులు, ఫైట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ముఖ్యంగా మాస్ చిత్రాల్లో నటిస్తూ ఆయన ప్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లనే రాబట్టారు. చరిత్రలో నిలిచిపోయే మరిన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాకముందే తన తదుపరి చిత్రాలను లైన్ లో పెట్టారు.
బాలయ్య బాబు 109, 110 చిత్రాల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతన్నాయి. అయితే బాబీతో పాటు బోయపాటితో ఈ చిత్రాలు చేయనున్నారనే టాక్ నడుస్తుండగా.. ఎవరితో బాలయ్య బాబు 109వ సినిమా అనే విషయం మాత్రం తేలలేదు. రామ్ తో బోయపాటి సినిమా చిత్రీకరణ నడుస్తుండగా.. ఈ గ్యాప్ లో బాలయ్య బాబు బాబీతో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. అలాగే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నందున సినిమా చేయరని, అలా కుదరకపోతే సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
కానీ తాజాగా ఇందుకు సంబంధించిన విషయాలపై ఓ క్లారిటీ వచ్చింది. బాలయ్య బాబు 109వ చిత్రం బాబీతో కాదని.. బోయపాటి శీనుతోనే అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అన్ని చర్చలు జరగగా.. బోయపాటి వచ్చే వరకు బాలకృష్ణ వేచి చూస్తారట. బోయపాటితో సినిమా తీసిన తర్వాతే బాబీతో సినిమా చేసేందుకు బాలయ్య బాబు ఆసక్తి చూపిస్తున్నారట.
ఈ మేరకు బోయాపటి, బాలకృష్ణల మధ్య రెండు రోజుల పాటు వరుసగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బోయపాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని, ఆయన డిసైడ్ చేసుకున్న తర్వాతే తాను ఏం చేయాలన్నది ఆలోచిస్తానని బాలయ్య బాబు క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. మరి బాబీ ఈలోగా మరో సినిమా చేసి వస్తారా.. ఏ హీరో దొరుకుతారు అన్నది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.