Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌లో ఎవ‌రికీ తెలీని కోణాన్ని చెప్పిన నాగ్‌!

By:  Tupaki Desk   |   31 May 2018 11:30 PM GMT
వ‌ర్మ‌లో ఎవ‌రికీ తెలీని కోణాన్ని చెప్పిన నాగ్‌!
X
వ‌ర్మ పేరు విన్నంత‌నే వివాదాలు గుర్తుకు వ‌స్తాయి. ఎప్పుడు ఎవ‌రిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో ఏ మాత్రం అంచ‌నా వేయ‌లేని వ్య‌క్తి. అంతా నా ఇష్టం అంటూ విష‌యాన్ని తేల్చేసే ఆయ‌న‌.. ఎవ‌రి మాట‌ను ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. త‌న మ‌న‌సుకు న‌చ్చింది మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పే వ‌ర్మ‌కు భావోద్వేగాలు అన్న‌వి అస్స‌లు ఉండ‌న‌ట్లుగా చెబుతారు.

ఆ మాట‌కు వ‌స్తే త‌న‌కు ఎలాంటి ఎమోష‌న్స్ ఉండ‌వ‌ని వ‌ర్మ ఇప్ప‌టికి చాలాసార్లు స్ప‌ష్టం చేశారు కూడా. అయితే.. వ‌ర్మ తాజా మూవీ ఆఫీస‌ర్ లో చాలా భావోద్వేగాలు ఉన్నాయ‌ట‌. మ‌రి..ఎమోష‌న్స్ అంటే త‌న‌కు తెలీద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు చెప్పే వ‌ర్మ‌.. సినిమాలో భావోద్వేగాల్ని ఎంత‌మేర పండిస్తార‌న్న డౌట్ కు నాగ్ సింఫుల్ గా తేల్చేశారు.

సెంటిమెంట్లు.. ఎమోష‌న్స్ త‌న‌కు లేవ‌ని వ‌ర్మ చెబుతుంటాడ‌న్నారు. ఎమోష‌న్స్ అంటే తెలియ‌ని వ్య‌క్తి.. నాలో ఎలాంటి ఎమోష‌న్స్ లేవ‌ని ఎలా అంటారంటూ ఎదురు ప్ర‌శ్న వేశారునాగ్‌. మొత్తానికి నాగ్ పుణ్య‌మా అని వ‌ర్మ‌లోని కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెప్పాలి. వ‌ర్మ‌లో నాగ్ చెప్పిన ఎమోష‌న్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.