Begin typing your search above and press return to search.
నా గడ్డం బాగుందా? చైతన్యది బాగుందా?
By: Tupaki Desk | 20 Sep 2016 6:35 PM GMT'ప్రేమమ్' ఆడియో ఫంక్షన్ కు తన కొడుకు చైతన్యను ఆశీర్వదించడానికి విచ్చేసిన కింగ్ నాగార్జున.. మాంచి ఇంట్రెస్టింగ్ కామెంట్లే చేశారు. ముఖ్యంగా ఆయన చైతూ గడ్డం గురించి మాటా్లడుతూనే.. అక్కినేని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేశారు.
''చైతన్య గెడ్డం చూసినప్పుడు నాకు చైతన్య గెడ్డం బాగుంది అనిపించి.. నేను ఓం నమో వెంకటేశాయ సినిమా కోసం గెడ్డం పెంచాను. అప్పటి నుండి చైతూ ఏమంటున్నాడంటే.. నాకంటే నీ గెడ్డమే బాగుంది అని కామెంట్ చేస్తున్నాడు. మీరే చెప్పండి.. ఎవరి గెడ్డం బాగుంది?'' అంటూ కామెంట్ నాగార్జున ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. ఇకపోతే 'ప్రేమమ్' సినిమా గురించి మాట్లాడిన నాగ్.. ''నాన్నగారి ప్రేమాభిషేకం.. నా గీతాంజలి.. వాటికి సరిపోయే ప్రేమకథ ప్రేమమ్. మలయాళంలో చాలామంది చూసే ఉంటారు. పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఇక్కడ కూడా అంతా సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం'' అంటూ చెప్పుకొచ్చారు.
దీనిపై స్పందించిన మూవీ లవర్స్ ఏమంటున్నారంటే.. అసలు చైతన్య, నాగార్జున అండ్ అఖిల్ మధ్యన ఎవరు హ్యాండ్సమ్ అంటూ పోల్ పెట్టడమే అనవసరం.. ముగ్గురూ ముగ్గురే అంటూ పొగిడేస్తున్నారు. అది నిజమే కదా.. ముగ్గురూ ఓ రేంజ్ అందగాళ్లే మరి!!