Begin typing your search above and press return to search.
పదే పదే నాగ్ అదే విషయం ఎందుకు చెబుతున్నట్లో...?
By: Tupaki Desk | 27 Oct 2019 5:39 AM GMTఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 క్లైమాక్స్ కు వచ్చేసింది. మరో వారంలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన దగ్గర నుంచి షో మీద అనేక విమర్శలు - ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ టీం చెప్పిన విధంగానే ఎలిమినేషన్ ఉంటుందని - ఓటింగ్ అంత ఫేక్ అని - ఆల్రెడీ ఒకరిని విన్నర్ గా ఫిక్స్ చేసేశారని షో మొదలైన దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీముఖిని విన్నర్ గా ఫిక్స్ చేసేశారని ప్రచారం జరుగుతుంది.అలాగే హౌస్ నుంచి బయటకొచ్చిన కొందరు సభ్యులు కూడా ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా మాట్లాడారు కూడా. ముఖ్యంగా హిమజ - మహేష్ లు హౌస్ నుంచి బయటకొచ్చాక గేమ్ శ్రీముఖికు అనుకూలంగా జరుగుతుందని - బిగ్ బాస్ టీంలో శ్రీముఖికు తెలిసిన వారు ఉన్నారని చెప్పారు.
అయితే ఆరోపణలని తిప్పేకోట్టేందుకు హోస్ట్ నాగార్జున తెగ కష్టపడిపోతున్నారు. ప్రతి శనివారం - ఆదివారం ఎపిసోడ్ లలో ఏం జరిగిన ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే జరుగుతుందని - వారి ఓటింగ్ వలనే సేఫ్ అయినా - ఎలిమినేషన్ అయినా జరుగుతుందనే పదే పదే చెబుతూ వస్తున్నారు.ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు గట్టిగానే కష్టపడ్డారు. అందుకు సంబంధించి ఇంటి సభ్యులకు కూడా క్లాస్ ఇచ్చారు. రాహుల్ గతంలో శ్రీముఖిపై చేసిన ఆరోపణల్లో అసలు నిజాన్ని నిగ్గుతేల్చారు. శ్రీముఖి తనను బిగ్ బాస్ కి రికమండ్ చేసిందని అందరితో చెప్పుకుంటుంది అంటూ రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని అనవసరంగా ఛాలెంజ్ లు చేస్తున్నావని క్లాస్ తీసుకున్నారు. ఇక్కడ ఎవరూ ఎవరిని రికమండ్ చేయరని జెన్యూయన్ గానే సెలక్షన్స్ జరుగుయతాయని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ తరువాత హౌస్ లోకి తిరిగివస్తూ.. అతనే విన్నర్ అని శివజ్యోతితో అన్నాడట.. అంటూ బాబాతో చెప్తున్న వీడియోను ప్లే చేసి శ్రీముఖిని ఇది నిజమా అంటూ నాగార్జున ప్రశ్నించారు. ఇక వారికి క్లారిటీగా వివరాలు చెప్పి - కొంచెం గట్టి క్లాసే తీసుకున్నారు. ఇక్కడ ఏం జరిగినా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే అని - వాళ్లే ఎలిమినేట్ చేసేది - విన్నర్ ని చేసేది అంటూ ఇంటి సభ్యులకు చెప్పుకొచ్చారు. మొత్తానికి నాగ్ బయట వస్తున్న ఆరోపణలని తిప్పేకోట్టేందుకే ఇలా పదే పదే మొత్తం ప్రేక్షకుల చేతిల్లోనే ఉందని మాట్లాడుతున్నారు.