Begin typing your search above and press return to search.

వెరైటీలు కోరుకుంటున్న నాగ్!!

By:  Tupaki Desk   |   5 Feb 2017 12:30 AM GMT
వెరైటీలు కోరుకుంటున్న నాగ్!!
X
సినిమాల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా వెనకాడని టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున. కొత్త డైరెక్టర్లతో కానీ.. కొత్త తరహా కాన్సెప్ట్ లతో కానీ నాగ్ చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేసి ఉండరని చెప్పచ్చు. ఎప్పటికప్పుడు కాలంతో పాటు సినిమాల్లో ట్రెండ్ మారుస్తున్నా.. నాగ్ మాత్రం అదే తరగని అందంతో నవ మన్మథుడిలా మెరిసిపోతూ ఉంటాడు.

ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ అంటూ వస్తున్న భక్తిరస చిత్రం కోసం బాగా ఎగ్రిసివ్ ప్రమోషన్స్ నే ప్లాన్ చేశాడు నాగ్. ప్రయోగాలు చేయడంలో తనకు ఎంతటి కిక్ ఉంటుందో తాజా ఇంటర్వ్యూలలో చెప్పాడు నాగార్జున. ముఖ్యంగా.. మనం తర్వాత ఊపిరి ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ సినిమా అందరినీ మెప్పించడంతో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అర్ధమయిందని చెబుతున్నాడు నాగార్జున. కొత్త తరహా కాన్సెప్టులను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే విషయం మరోసారి నిరూపితం అయిందని చెప్పాడు. ఇకపై చేయబోయే చిత్రాలు కూడా విభిన్నమైన స్టోరీలు.. వెరైటీ కాన్సెప్టులు ఉండేలా చూసుకుంటాడట నాగార్జున.

ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ అంటూ కలియుగ దైవం శ్రీనివాసుడి భక్తుడు హథీరాం బాబాగా నటించిన నాగార్జున.. తన మరుసటి మూవీ రాజు గారి గది2 అంటూ దెయ్యం సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇంత డిఫరెంట్ గా వరుస సినిమాలు ఎంచుకోవడం అందరికీ సాధ్యం అయ్యే సాహసం కాదులే!