Begin typing your search above and press return to search.
బంగార్రాజులో చైతూ ఉన్నట్లా? లేనట్లా?
By: Tupaki Desk | 4 Feb 2021 11:11 AM GMTనాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్ర ఆధారంగా బంగార్రాజు సినిమాను చేయబోతున్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సుదీర్ఘ కాలంగా బంగార్రాజు స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను అన్న పూర్ణ స్టూడియోలో ప్రారంభించినట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్ ప్రారంభంకు ముందు ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో నాగచైతన్య పాత్ర ను తొలగించారట. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు నాగచైతన్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల స్క్రిప్ట్ లో మార్పు చేశారంటూ సమాచారం అందుతోంది.
ప్రస్తుతం నాగచైతన్య 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ కొన్ని వారాల క్రితమే ప్రారంభం అయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ కారణంగానే బంగార్రాజు సినిమా నుండి చైతూ తప్పుకున్నాడని అంటున్నారు. కాని ఇప్పటి వరకు బంగార్రాజు షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అధికారిక అప్ డేట్ మాత్రం రాలేదు. దాంతో ఇంకా అక్కినేని అభిమానులు మాత్రం బంగార్రాజులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ఉంటాడని ఉండాలని ఆశ పడుతున్నారు. మరి బంగార్రాజు సినిమా అధికారిక ప్రటన ఎప్పుడు వస్తుందో చూడాలి.