Begin typing your search above and press return to search.

సామ్, చై.. మరో వ్యక్తిని లాగారట!

By:  Tupaki Desk   |   6 May 2023 10:40 AM GMT
సామ్, చై.. మరో వ్యక్తిని లాగారట!
X
అక్కినేని నాగచైతన్య, గార్జియస్ బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన బైలింగువల్ మూవీ కస్టడీ. ఈ చిత్రం మే 12వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సింగిల్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోగా.. నాగ చైతన్య సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో సామ్ తో విడాకులపై మొదటి సారిగా చై స్పందించాడు.

సమంత, తాను విడిపోయి రెండేళ్ల అవుతోందని.. చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది అవుతుందని గుర్తు చేసుకున్నారు. న్యాయస్థానం కూడా తమకు విడాకులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. సామ్ చాలా మంచిదని, ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రూమర్స్ వల్ల తమ మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయన్నారు.

ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. అది తనను ఎంతగానో బాధించిందని అన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం తన గతంలో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగడం అని వివరించారు. దీని వల్ల తాను చాలా సఫర్ కావాల్సి వచ్చినట్లు వెల్లడించారు. తనతో పాటు ఆ మూడో వ్యక్తిని కూడా అగౌరవ పరిచినట్లు అయిందని పేర్కొన్నారు.

ఎక్కడికి వెళ్లినా, ఏం చేసిన, సినిమా ప్రమోషన్లు, మీటింగ్స్ లో పాల్గొన్నా తన వ్యక్తిగత జీవితం గురించే అంతా ప్రశ్నిస్తుంటారనే చై చెప్పుకొచ్చాడు. మొదట్లో వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడినన్నారు.

కాకపోతే ఇప్పటికీ వాళ్లు తన పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఉన్నది మాట్లాడితే పర్లేదు కానీ వదంతులు సృష్టించడం, ఎందుకో తనకింకా అర్థం కావడం లేదని చైతన్య అన్నారు.

అలాగే తాను నటించిన కస్టడీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉన్నట్లు పేర్కొన్నాడు. వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమ్ గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.