Begin typing your search above and press return to search.

చైతూ స్పీడ్ చూడ తరమా

By:  Tupaki Desk   |   19 Feb 2016 6:57 AM GMT
చైతూ స్పీడ్ చూడ తరమా
X
మలయాళ మూవీ ప్రేమమ్ రీమేక్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. ముగ్గురు హీరోయిన్లతో మూడు గెటప్పులతో సందడి చేయనున్న చైతూ.. ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ లోగానే నాగ చైతన్య నటించిన మరో మూవీ కూడా రిలీజ్ కి రెడీ అయిపోతుంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా కొంచెం అటూ ఇటూగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పుడు 'సాగ్గాడే చిన్ని నాయన' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా చైతూ కోసం ఓ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇవన్నీ కాక.. మరో క్రేజ్ ప్రాజెక్ట్ పై కూడా నాగ చైతన్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఓ మూవీ చేసేందుకు ఓకే అన్నాడట ఈ అక్కినేని హీరో. హరీష్ శంకర్ కి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకూ ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ స్టోరీ చేసే ఛాన్స్ రాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్.. చైతూ కోసం ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

ఇప్పటివరకూ హరీష్ శంకర్ స్టోరీని చైతూ వినకపోయినా.. హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడని అంటున్నారు. ప్రేమమ్ చిత్రం షూటింగ్ ఏప్రిల్ ప్రారంభానికే అయిపోయే అవకాశం ఉండడంతో.. ఆ లోగా స్క్రిప్ట్ వర్క్ రెడీ అయితే.. హరీష్ శంకర్-చైతూల సినిమా స్టార్ట్ అయిపోవచ్చు.