Begin typing your search above and press return to search.

పెళ్లిపై మళ్లీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన చైతు

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:37 PM GMT
పెళ్లిపై మళ్లీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన చైతు
X
అక్కినేని నాగచైతన్య.. సమంతల లవ్ స్టోరీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో చాలామంది ఈ విషయంపై మాట్లాడారు కానీ..అసలు జంట మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. రీసెంట్ గా చైతు కూడా సమంతతో పెళ్లి విషయంలో ఓపెన్ అయిపోయాడు. తనే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. రీసెంట్ గా చైతు ఓ షాక్ ఇచ్చాడు.

సాధారణంగా ఇంట్లో పెద్ద కొడుకు పెళ్లయ్యాక కానీ.. చిన్న కొడుకు పెళ్లి గురించి మాట్లాడరు. కానీ చైతు మాత్రం ముందు తమ్ముడి నిశ్చితార్ధం పెళ్లి జరుగుతాయని చెప్పేశాడు. డిసెంంబర్ లో అఖిల్ శ్రీయా భూపాల్ ల నిశ్చితార్ధం పై నాగ్ కూడా రీసెంట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పెళ్లి కంటే ముందే తమ్ముడు అఖిల్ పెళ్లే జరుగుతుందని చైతు ఓపెన్ గానే చెప్పేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అలాగని తన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడనే సంగతిని మాత్రం చైతు చెప్పలేదు. వాళ్లిద్దరూ రెడీ అంటే పెళ్లి చేసేందుకు నేను రెడీ అని నాగ్ చెప్పాక కూడా.. వీళ్లు ఇంకా ఆ ముహూర్తం విషయంలో ఆగుతుండడం ఆశ్చర్యకరం. తనతో పెళ్లి తర్వాత కూడా సమంత హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందని నాగ చైతన్య చెప్పడం అసలు హైలైట్ గా చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/