Begin typing your search above and press return to search.
మిస్టర్ డైరెక్టర్ తో అక్కినేని ప్రేమకథ!?
By: Tupaki Desk | 21 Oct 2016 4:50 AM GMTఅక్కినేని నాగచైతన్య ఇప్పుడైతే ఫుల్లు ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉన్నాడు. ప్రేమమ్ సక్సెస్ తో కెరీర్ లో తొలిసారిగా సోలో హీరోగా 20కోట్ల వసూళ్ల మార్క్ ను అందుకున్న హీరోగా అవతరించాడు. అంతేకాదు.. ప్రేమమ్ ను రీమేక్ చేయడం చైతు అతి పెద్ద తప్పు అన్న వాళ్ల నోళ్లను కూడా మూయించగలిగాడు. ఈ కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వరుస సినిమాలకు బాగానే ఉపయోగపడనుంది.
ప్రస్తుతం మెగా కుర్రాడు వరుణ్ తేజ్ తో మిస్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల.. తర్వాతి ప్రాజెక్ట్ కోసం నాగ చైతన్యను అప్రోచ్ అయ్యాడట. చైతు హీరోగా ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీని ప్లాన్ చేసుకున్న వైట్ల.. తన స్టోరీని ఇప్పటికే అక్కినేని నాగ్ అండ్ సన్స్ కి వినిపించేశాడట కూడా. వైట్ల తో చైతు మూవీ ఖాయమైపోయిందని కూడా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. కొత్త డైరెక్టర్ కృష్ణ.. ఇంద్రగంటి మోహన్ కృష్ణలతో చైతు ఇప్పటికే కమిట్ అయ్యాడు. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమా కూడా ఫిక్స్ అవడంతో.. రెండు రెండు చొప్పున చేసుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. అలా చూసినా చైతు-వైట్ల సినిమా బయటకొచ్చేసరికి కనీసం ఏడాది పట్టొచ్చని టాక్.