Begin typing your search above and press return to search.

మజిలి మిడిల్ క్లాసు లుక్కు కంటే ఇది కేక!

By:  Tupaki Desk   |   5 March 2020 8:30 AM GMT
మజిలి మిడిల్ క్లాసు లుక్కు కంటే ఇది కేక!
X
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మంచి కాఫీ లాంటి సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి' లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో 'ఫిదా' భామ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చైతు ఒక దిగువ మధ్య తరగతికి చెందిన తెలంగాణా కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. తొలిసారిగా తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా 'లవ్ స్టోరి' సినిమా నుండి కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో ఒక పోస్టర్లో చైతు పూర్తిగా డీ-గ్లామరస్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. చైతు ఎప్పుడూ క్లాస్ గా స్టైలిష్ గా కనిపిస్తాడు. కానీ ఈ పోస్టర్లో మాత్రం అచ్చంగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు. షార్ట్ హెయిర్ స్టైల్.. కొంచెం చిందరవందరగా ఉన్న గడ్డం.. పర్ఫెక్ట్ సైజ్ లో ఉన్న టీ షర్టు కాకుండా కొంచెం వదులుగా ఉండే టీషర్టు వేసుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు. గతంలో కంటే సన్నగా ఉండడం.. మేకప్ లేకపోవడంతో చైతు కొత్తగా కనిపిస్తున్నాడు.

శేఖర్ కమ్ముల సినిమాలలో అనవరసమైన కమర్షియల్ హంగామా ఉండదు. దాదాపుగా అన్ని సీన్లలో సహజత్వం కనిపిస్తుంది. నాగ చైతన్య -సాయి పల్లవి జోడిని.. వారి ప్రేమకథను కమ్ముల సార్ ఈసారి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో వేచి చూడాలి.