Begin typing your search above and press return to search.
మహేశ్ vs పవన్.. ఫ్యాన్ వార్..!
By: Tupaki Desk | 11 May 2022 3:30 AM GMTసినీ ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్ వార్ అనేది సర్వసాధారణం. స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. వారి అభిమానులు ఇతర హీరోల ఫ్యాన్స్ పై ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో థియేటర్ల వద్ద రెండు వర్గాల అభిమానుల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఫ్యాన్ వార్స్ అన్నీ సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి.
ఒకప్పుడు ప్రత్యక్షంగా ఘర్షణకు దిగే అభిమానులు.. ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నారు. తమకు నచ్చని హీరోలపై అభ్యంతరకరమైన కామెంట్స్.. అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలతో కించపరిచే పోస్టులు పెడుతున్నారు.
మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గ్రేట్ అని అంటూ గొడవకు దిగుతున్నారు. కలెక్షన్స్ లెక్కలు - బాక్సాఫీస్ రికార్డులను బయటకు తీసి ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇది మిగతా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్ హీరోల అభిమానుల విషయంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విడుదలప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ చూస్తుంటాం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ట్వీట్ వార్ జరుగుతోందనే విషయం అర్థం అవుతుంది.
మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ మూవీ సందడే కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది? ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుంది? అనే వాటిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పీకే మరియు మహేశ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
గతేడాది ప్రారంభంలో రిలీజ్ అయిన పవన్ 'వకీల్ సాబ్'.. ఫిబ్రవరి చివరి వారంలో వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే ఇప్పుడు 'SVP' సినిమాకి పాజిటివ్ టాక్ మరియు మంచి రేటింగ్స్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే తమ హీరో కెరీర్ హయ్యెస్ట్ ను క్రాస్ చేస్తుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.
దీని కారణంగానే ఇప్పుడు పీకే ఫ్యాన్స్ భయపడుతున్నారని.. అందుకే వారు ఉద్దేశపూర్వకంగా 'సర్కారు వారి పాట' ను టార్గెట్ చేస్తున్నారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు పవన్ అభిమానులు కూడా దీనికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తమ హీరో సినిమాలకు సృష్టించిన అడ్డంకుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని.. అసలు మహేష్ ను పవన్ కు పోటీదారుగా భావించమని కామెంట్స్ చేస్తున్నారు.
తమ హీరో కెరీర్ లో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఐదు ఉన్నాయని.. పవన్ కు మాత్రం కేవలం రెండే ఉన్నాయని మహేష్ ఫ్యాన్స్ గట్టిగా బదులిస్తున్నారు. రికార్డుల టాపిక్ వస్తే టికెట్ రేట్ల ఇష్యూ అని.. బుక్ మై షో సమస్య అని.. కరోనా పాండమిక్ అని కథలు చెబుతుతారని పీకే ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య పరస్పర ట్వీట్ వార్ జరుగుతూనే ఉంది. మేం మేం బాగానే ఉంటామని హీరోలు చెబుతున్నా.. వారి అభిమానులు మాత్రం ఇలా మళ్లీ మళ్లీ ఫ్యాన్స్ వార్స్ చేస్తూ.. తమ హీరోలను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని న్యూట్రల్ గా ఉండేవారు విమర్శిస్తున్నారు.