Begin typing your search above and press return to search.
మహేష్ సోలోగా రావాలంటే ఇక అప్పుడే?
By: Tupaki Desk | 13 March 2023 6:00 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర అనే సినిమా రూపొందుతోంది. తమిళనాడులో సూపర్ హిట్ గా నిలిచిన వేదాలమ్ సినిమాని తెలుగులో భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా... కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో శ్రీముఖితో ఖుషీ నడుము సీన్ రిపీట్ చేయబోతున్నారని అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని ఒక పాటను రీమిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆ సంగతి ఇప్పుడు పక్కన పెడితే ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ 2023లో సినిమాని రిలీజ్ చేయమని మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా నిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆ డేటుకు రావాలని మహేష్ బాబు 28 సినిమా యూనిట్ ముందే ప్లాన్ చేసుకుంది గాని ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమనే అంచనాలు వెలబడుతున్నాయి.
కాస్త ఆలస్యంగా అయినా దసరాకి వద్దాం అనుకుంటే అప్పుడే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న వినోదాయ సీతం రీమేక్ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 108వ సినిమా అని కూడా దసరాకే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఒకవేళ మహేష్ బాబు సినిమాకి సోలో రిలీజ్ కావాలంటే దీపావళికి రావాల్సిందేనని... ఒకవేళ దీపావళి మిస్ అయితే సంక్రాంతి అదే విధంగా క్రిస్టమస్ కి కూడా ఇతర సినిమాలతో పోటీ తప్పదని అంటున్నారు. దీపావళికి కూడా పోటీ ఉంటుంది కానీ మహేష్ బాబు సినిమా అంటే వేరే పెద్ద సినిమా రావడానికి కాస్త వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి మహేష్ బాబు సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.