Begin typing your search above and press return to search.
రాజమౌళి వర్క్ షాప్ కోసం మహేష్ కష్టాలు
By: Tupaki Desk | 26 Feb 2023 8:00 AM GMTమహేష్ బాబు ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళి సినిమాలో బిజీ అవ్వబోతున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఎంత ఎక్కువ సమయం తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సీన్ తీయడానికి రెండు మూడు రోజులు కూడా రాజమౌళి తీసుకుంటూ ఉంటాడని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో రాంచరణ్, ఎన్టీఆర్ వంటి వారు బయటపెట్టారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమిటంటే ప్రస్తుతానికి రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్ ఉన్న నేపథ్యంలో ఆస్కార్ అవార్డు లభిస్తుందేమో అని ఇప్పటినుంచి అమెరికా వెళ్లి వేచి ఉన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ సాంగ్ కి మరిన్ని అవార్డులు వస్తూ ఉండటంతో అక్కడే ఉండి రిసీవ్ చేసుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు సినిమా గురించి ఒక తాజా అప్డేట్ వీడితే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... ఆస్కార్ అవార్డులో వేడుక పూర్తయిన వెంటనే రాజమౌళి ఒక వర్క్ షాప్ ప్రారంభించబోతున్నారని మహేష్ బాబు ఒకపక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ చేస్తూనే మరోపక్క ఈ సినిమా కోసం రెండు నెలల పాటు వర్క్ షాప్ కి హాజరయ్యే విధంగా డేట్లు కేటాయించడం తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు 2023 ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్టుగా జరిగితే కనుక ఈ సినిమా జనవరి 2024 నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఒకరకంగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ షూటింగ్ లేట్ అయ్యి ఒకవేళ వాయిదా పడిన దసరా లేదా సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. అయితే మహేష్ బాబు మాత్రం పూర్తిస్థాయిలో రాజమౌళి సినిమా కోసం సన్నద్ధం కాబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.